బాసర IIIT ఘటనపై పోలీస్ శాఖ స్పష్టీకరణ

బాసర IIIT ఘటనపై పోలీస్ శాఖ స్పష్టీకరణ
నిర్మల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : బాసర IIIT లో విద్యార్థులను పోలీసులు దూషించారని సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో వినిపిస్తున్న వాయిస్ పూర్తిగా అబద్దం,ఆ వీడియో లో ఉన్న వాయిస్ మార్ఫింగ్ చేసి, తప్పుదారి పట్టించేలా కావాలని రూపొందించబడింది.కావున విద్యార్థులు, ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాము.
ఇలా మార్ఫ్ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం, వైరల్ చేయడం వంటి చర్యలు చట్టపరంగా శిక్షార్హం. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోబడతాయని నిర్మల్ జిల్లా పోలీసు శాఖ స్పష్టం చేసింది. ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించి, అసత్య ప్రచారాలను ప్రోత్సహించవద్దని నిర్మల్ జిల్లా పోలీస్ విజ్ఞప్తి చేస్తోంది
