Police | శ‌భాష్ పోలీస‌మ్మ‌..

Police | శ‌భాష్ పోలీస‌మ్మ‌..

  • వృద్ధురాలిని పోలింగ్ కేంద్రంలోకి త‌ర‌లించిన స్పెషల్ బ్రాంచ్ ఎస్సై శిరీష

Police | లక్షేట్టిపేట, ఆంధ్రప్రభ : వెంకట్రావు పేట్ పోలింగ్ కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తున్న రామగుండం స్పెషల్ బ్రాంచ్ ఎస్సై శిరీష చిత్తశుద్ధిని చాటి ప్రజల మన్నలను పొందారు. పలువురు వృద్ధులు ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రానికి వచ్చే క్రమంలో ఇబ్బందులు పడుతుంటే ఎస్సై శిరీష స్వయంగా వీల్ చైర్‌ లో ఓటింగ్ గది వద్దకు వారిని తరలించారు. వెంకట్రావుపేట్ లోని ఓ 90 ఏళ్ల వృద్ధురాలు నడవలేని స్థితిలో ఉంటే వీల్ చైర్ లో సెంటర్‌కు తరలించి ఖాకీ డ్రెస్‌లో ఉన్నప్పటికీ కరుణ చూపారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అందరూ తప్పకుండా వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యంలో ఓటింగ్ శాతం పెరిగేలా అందరూ కృషి చేయాలని ఎస్సై ‘ఆంధ్రప్రభ’తో తమ మనోభావాన్ని పంచుకున్నారు.

Leave a Reply