వీధుల్లోకి వచ్చి ఆందోళనలు

వీధుల్లోకి వచ్చి ఆందోళనలు
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి తర్వాత జమ్మూ కాశ్మీర్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీనగర్లో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టారు.
పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి, టియర్ గ్యాస్ ప్రయోగించారు. కాశ్మీర్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇంటర్నెట్ సర్వీసులు, మొబైల్ డేటా సేవలపై ఆంక్షలు విధించారు. భద్రతా దళాలను భారీగా మోహరించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం శ్రీనగర్లో భారీ బందోబస్తు కొనసాగుతోంది.
