POLICE | ట్రాఫిక్ ఏఎస్ఐకి సెల్యూట్..

POLICE | ట్రాఫిక్ ఏఎస్ఐకి సెల్యూట్..
- అంధ వృద్ధుడికి సాయం చేసిన రియాజ్
POLICE | తిరుపతి తుడా, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని చూడడానికి 80 ఏళ్ల అంధ వృద్ధుడికి తిరుపతి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రియాజ్ సాయం చేశాడు. నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు, లోకేష్‌ను కలవడానికి భారీగా ప్రజల చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఓ వృద్ధుడు కూడా అక్కడికి వచ్చాడు. కళ్ళు కనబడక రోడ్డు పక్కనే నిలిచి ఉన్న వృద్ధుడిని అక్కడే ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్న తిరుపతి ట్రాఫిక్ ఏఎస్ఐ రియాజ్ చేత పట్టుకుని పోలీస్ చెకింగ్ పాయింట్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ తనిఖీలు చేసిన అనంతరం లోకేష్‌ను కలవడానికి పంపించారు. అంధ వృద్ధుడికి సాయం చేసిన తిరుపతి ట్రాఫిక్ ఏఎస్ఐ రియాజ్‌ను పలువురు టీడీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, పోలీసులు ప్రశంసించారు.
