Police | పోలీసులపై దౌర్జన్యం.. ట్రీట్మెంట్ ఇదే.!

Police | పామర్రు – ఆంధ్రప్రభ : మద్యం సేవించి ఇష్టానుసారంగా వ్యవహరించే వ్యక్తులపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. జర్నలిస్టులనీ, సామాన్య వ్యక్తులని చూడకుండా తప్పు ఎవరు చేసినా క్షమించేది లేదని వృత్తి ధర్మాన్ని పోలీసులు బాధ్యతగా నిర్వహిస్తున్నారు.

మచిలీపట్నంలో మద్యం సేవించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన ఘటనలో యువకులను మచిలీపట్నం వీధుల్లో నడిపించిన పోలీసులు ప్రజల్లో ధైర్యం కల్పించారు. ప్రస్తుతం పామరు పట్టణంలో జరిగిన ఓ ఘర్షణలో హల్చల్ చేసిన జర్నలిస్టులను సైతం పామర్రు నడిరోడ్డుపై నడిపించారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని పోలీసులు హెచ్చరికలు జారీ చేసస్తున్నారు.

పామర్రులోని చల్లపల్లి రోడ్డులో ఆదివారం రాత్రి గొడవ జరిగిన విషయం తెలిసిందే. మద్యం మత్తులో గొడవ చేస్తున్న వారిని అడ్డుకోబోయిన పోలీసులపైనే ఇద్దరు విలేకరులు సహా ఆరుగురు వ్యక్తులు దౌర్జన్యానికి దిగారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేసి, స్టేషన్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు నడిపించుకుంటూ తీసుకెళ్లి ఊరేగించారు. అనంతరం వారిని గుడివాడ కోర్టుకు తరలించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.

Leave a Reply