police | వీటికి బలైతే ఎలా..?

police | వీటికి బలైతే ఎలా..?

హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్(Betting, Gaming) యాప్‌లు సమాజంలోని అన్ని వర్గాలను వేధిస్తున్నట్లే, సమాజానికి రక్షణ కవచంలా ఉండాల్సిన యువ పోలీసులను కూడా ఆకర్షించి వారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో పలువురు యువ కానిస్టేబుళ్లు, సబ్-ఇన్స్పెక్టర్లు ఈ వ్యసనం వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. నిజానికి సమాజంలో అరాచకాలు పెరిగినప్పుడు సామాన్యుడు వెళ్లే ఏకైక చోటు పోలీస్ స్టేషన్.

కానీ, ఆ రక్షణ కవచం లాంటి పోలీసు వ్యవస్థే ఇప్పుడు ఒక వ్యసనం కోరల్లో చిక్కుకుంటోంది. స్మార్ట్‌ఫోన్(Smartphone) చేతిలో ఉంటే చాలు.. క్షణాల్లో లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఓ వైపు బెట్టింగ్ యాప్ లకు బానిలుగా మారి అప్పులపాలై, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరో వైపు ఈ బెట్టింగ్,ఆన్లైన్ యాప్ ల వల్ల జరిగే నష్టాల మీద పోలీసు ఉన్నతాధికారులు అవగాహన కల్పించి, వాటి బారి నుంచి మనల్ని కాపాడుతున్నారు. అయితే సాధారణ పౌరులను చైతన్యపరచాల్సిన పోలీసులే అంతర్గతంగా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు బానిసలై జీవితాలను, వృత్తిని పణంగా పెడుతున్నారు.

police | అసలేం జరుగుతోంది?

ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులది. కానీ పోలీసులే బాధితులయ్యి, బలవుతుంటే సామాన్య ప్రజల పరిస్థితి ప్రశ్నార్థకంగా ఉంటుంది. దానికి పోలీసులు బెట్టింగ్ యాప్ లకు బానిసై, అప్పులు చేసి, ఆత్మహత్యల(suicide)కు పాల్పడటమే కారణం. ఇటీవల వెలుగులోకి వస్తున్న ఘటనలు పోలీసు శాఖను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.

డ్యూటీలో ఉండి కూడా మొబైల్ ఫోన్లలో క్రికెట్ బెట్టింగ్, రమ్మీ, ఆన్‌లైన్ కాసినోలు ఆడుతూ పట్టుబడుతున్న పోలీసుల సంఖ్య పెరుగుతోందని అర్థమవుతుంది. బెట్టింగ్ అప్పులు తీర్చడానికి కొందరు పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చి, సెటిల్మెంట్ల(settlements) ద్వారా కమీషన్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. బెట్టింగ్ యాపుల్ వల్ల అప్పుల పాలైన పోలీసుల వరుస కథనాలు చూద్దాం…

police | రివాల్వర్ తో కాల్చుకున్న కానిస్టేబుల్..

ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడి చేసిన అప్పులు తీర్చలేక ఇటీవలే సంగారెడ్డి జిల్లాలో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. 2024 బ్యాచ్‌కు చెందిన సందీప్ కుమార్ సంగారెడ్డి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. ఆన్లైన్ గేమ్స్(online games), బెట్టింగ్స్కు అలవాటు పడి బంధువులు, స్నేహితుల వద్ద రూ. లక్షల్లో అప్పులు చేశాడు. బాకీ తీర్చమని వారి నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో భరించలేక నవంబర్ 3వ తేదీన సంగారెడ్డిలోని మహబూబ్సాగర్ చెరువు కట్టపై రివాల్వర్తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

police | ఫిల్మ్‌నగర్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

బెట్టింగ్, ఆన్లైన్ గేమ్స్ఆడి, చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపానికి గరైన కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌( police station) పరిధిలో జరిగింది. ఉప్పల్‌ మల్లికార్జున నగర్‌కు 2009 బ్యాచ్‌ కు చెందిన డి.శ్రీకాంత్‌ హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించేవాడు.

కొంతకాలంగా అతను ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ మూడు నాలుగు రోజులుగా విధులకు సైతం వెళ్లడం లేదు. ఈ క్రమంలో అతను శనివారం ఇంట్లో చీరతో ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన కుటుంబం అప్పులు తీర్చడానికి తమ ఇల్లు అమ్మినా పరిస్థితి చక్కబడలేదని సమాచారం.

police | రివాల్వర్ అమ్మిన ఎస్సై

హైదరాబాద్ అంబర్పేట క్రైమ్ ఎస్సై భానుప్రకాశ్ బెట్టింగ్ యాప్స్ కు బానిసై భారీగా అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు ఏకంగా రికవరీలో వచ్చిన బంగారంతో పాటు సర్వీస్ రివాల్వర్ను(service revolver) కూడా తాకట్టు పెట్టినట్లు ఆరోపణలువస్తున్నాయి. భానుప్రకాశ్ కు డిపార్ట్మెంట్ ఇచ్చిన రివాల్వర్ ప్రస్తుతం అదృశ్యం కాగా మిస్సింగ్ కేసులో ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. బెట్టింగ్ యాపుల్లో చేరి దాదపు రూ.80 లకల వరకు పోగొటుకున్నాడని వినికిడి.

police | హైడ్రా కమిషనర్ గన్ మెన్ ఆత్మహత్యాయత్నం

ఆదివారం హైడ్రా కమిషనర్(Hydra Commissioner) గన్ మెన్ గా విధులు నిర్వహిస్తున్న కృష్టచైతన్య తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. హైదరాబాద్ నగర శివారు హయత్ నగర్లోని తన ఇంట్లో తుపాకీతో కాల్చుకున్నాడు. అయితే కృష్ణచైతన్య ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఆర్ధిక సమస్యలే కారణం అని తెలుస్తోంది. బెట్టింగ్ యాప్ల వల్ల అతడు పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోయాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

police | పోలీసు వ్యవస్థకు పెనుముప్పు

ఇలాంటి పరిస్థితులు పోలీసు వ్యవస్థకి సవాలుగా మారనుంది. ఆత్మహత్యలు, చోరీలు, సెటిల్మెంట్లు వంటి నేర ప్రవృత్తి పోలీసుల్లో పెరిగితే ఇక సామాన్య ప్రజలకు న్యాయం(Justice) ఎలా చేకూరుతుంది. పోలీసులే బెట్టింగ్ యాప్ లలో పెట్టుబడి పెడుతుంటే, ఇక బాధితుల బాధలు పట్టించుకునేది ఎవరు. కనుక ఇలాంటి ధొరణివల్ల పోలీసు వ్యవస్తకు, జమాజానికి పెను ముప్పుగా మారనుంది.

police | పరిష్కార మార్గాలు ఇవే…

పోలీసు విభాగంలో ఇంటర్నల్ విజిలెన్స్ టీమ్స్ పెంచాలి. ఆన్లైన్, బెట్టింగ్ యాప్ ల వల్ల కలిగే నష్టాలపైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. నేర ప్రవృత్తి భావన కలగకుండా కౌన్సిలింగ్(Counseling) ఇవ్వాలి. తరచుగా ఎవరైనా అధికారి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా లేదా అసాధారణ ప్రవర్తన కలిగి ఉన్నారా అనేది గమనించాలి. పోలీస్ స్టేషన్లలో డ్యూటీ సమయంలో మొబైల్ ఫోన్ల వినియోగంపై కఠినమైన నిబంధనలు అమలు చేయాలి. బెట్టింగ్ అనేది ఒక మానసిక వ్యాధి.

దీనికి బానిసైన పోలీసులకు వెంటనే కౌన్సెలింగ్ ఇచ్చి వారిని మార్చాలి. చట్టాన్ని కాపాడాల్సిన చేతులకు సంకెళ్లు పడకూడదు అంటే.. పోలీసు శాఖలో అంతర్గత ప్రక్షాళ(internal cleansing)న జరగాలి. రక్షకులే భక్షకులుగా మారకముందే ప్రభుత్వం, ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే ప్రజలకు శాంతి-భద్రతలపై భరోసా ఉంటుంది.

police | బెట్టింగ్ యాప్లపై అవగాహన కల్పిస్తాం

ఈ రోజుల్లో యువతకు కష్టపడి పనిచేసే తత్వం లేదని ఉన్నత స్థాయిలో ఉన్న ఓ పోలీసు అధికారి అన్నారు. ఎడ్యుకేష న్ సిస్టమ్(Education System) వ్యాల్యూస్ నేర్పడం లేదని, కష్టపడటం మానేసి చాలా మంది ఈజీ మనీ కోసం నేరాలకు పాల్పడుతున్నట్టు తెలిపారు. బెట్టింగ్ అల్గారితమ్ అనేది ఒక వ్యసనంగా మారిపోయిందని, దీంతో అప్పుల్లో కూరుకుపోతున్నట్టు తెలుస్తోందన్నారు.

ఇక.. పోలీస్ డిపార్ట్ మెంట్(Police Department) అనేది సమాజంలో ఒక భాగమేనని, యువకులైన పోలీసులు కూడా సామాన్య ప్రజల మాదిరిగానే ఆలోచించి, బెట్టింగ్, యాప్ లకు బానిసలుగా మారుతున్నట్టు తెలుస్తోం దన్నారు. దీనిపై అవగాహన కల్పించి, నేర ప్రవృత్తి, నుంచి బయట పడేందుకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.

click here for more

click here to read Rachakonda CP | పెరిగిన నేరాలు…

Leave a Reply