POLICE | ఇన్ స్పెక్టర్ల బదిలీలు..
POLICE | కడప, ఆంధ్రప్రభ : జోన్ – 4 పరిధిలో భాగంగా కడప జిల్లాలో పని చేస్తున్న పలువురు పోలీసు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేశారు. కర్నూలు రేంజ్ డీఐజీ డా. కోయ ప్రవీణ్ ఐపీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. కడప జిల్లా బదిలీల వివరాల విషయానికి వస్తే.. ముద్దనూరు యూపీఎస్ – కె. దస్తగిరి నియమించారు. లక్కిరెడ్డిపల్లి సర్కిల్ – డి. రామూ, ప్రొద్దుటూరు టౌన్ పోలీస్ స్టేషన్ – బి. మల్లికార్జున గుప్తా, ప్రొద్దుటూరు–III టౌన్ పోలీస్ స్టేషన్ – వి. వేణుగోపాల్ (పునర్నియామకం), కడప–II టౌన్ పోలీస్ స్టేషన్ – యు. సదాశివయ్య, డిస్ట్రిక్ట్ క్రైం రికార్డ్స్ బ్యూరో (డీసీఆర్బీ), కడప – హెచ్. కృష్ణంరాజు నాయక్, సీసీఎస్–I, కడప నుంచి పలువురు ఇన్‌స్పెక్టర్లను ఇతర విభాగాలకు బదిలీ చేశారు. ఈ బదిలీలతో జిల్లాలో పోలీసు పరిపాలన మరింత పటిష్టం కానుందని అధికారులు భావిస్తున్నారు.
నంద్యాల జిల్లాలో పోలీసు ఇన్‌స్పెక్టర్ల స్థానభ్రంశం..
టౌన్, ట్రాఫిక్, డీపిటిసి, డీసీఆర్బీలో మార్పులు..
నంద్యాల జిల్లాలోని వివిధ పోలీసు విభాగాల్లో పని చేస్తున్న ఇన్‌స్పెక్టర్లకు భారీ స్థాయిలో బదిలీలు జరిగాయి. పరిపాలనా అవసరాల దృష్ట్యా ఈ మార్పులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. నంద్యాల జిల్లా బదిలీల వివరాలు ఏంటంటే… నంద్యాల–III టౌన్ పోలీస్ స్టేషన్ – ఈ. కంబగిరి రాముడు, నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ – ఓ. మహేశ్వర్ రెడ్డి, డీపిటిసి, నంద్యాల – డి. రాము, డీసీఆర్బీ, నంద్యాల – జి. ప్రసాదరావు, ఎస్‌బీ–I, నంద్యాల – బి.వి. రమణ, ఆళ్లగడ్డ రూరల్ సర్కిల్ – జి. జీవన్ గంగానాథ్ బాబు. ఈ మార్పులతో నంద్యాల జిల్లాలో నేర నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ మరింత సమర్థంగా సాగుతుందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
కర్నూలు జిల్లాలో ఇన్‌స్పెక్టర్ల బదిలీలు..
ఆదోని, శ్రీశైలం, ఓర్వకల్లు, ఆత్మకూరులో కొత్త నియామకాలు
కర్నూలు జిల్లాలోని పలు కీలక పోలీస్ స్టేషన్లు, విభాగాల్లో పని చేస్తున్న ఇన్‌స్పెక్టర్లకు బదిలీలు చేపట్టారు. డీఐజీ ఆదేశాల మేరకు ఈ మార్పులు తక్షణమే అమల్లోకి వచ్చాయి. కర్నూలు జిల్లా బదిలీల వివరాల విషయానికి వస్తే… ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ – ఎ. చాన్ బాషా, శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ – జి. చంద్రబాబు, శ్రీశైలం టూ టౌన్ పోలీస్ స్టేషన్ – జి. సుబ్బారావు, ఓర్వకల్లు అవుట్‌పోస్ట్ – డి. మురళీధర్ రెడ్డి, ఆత్మకూరు యూపీఎస్ – డి. మస్తాన్ వలి,
గోనెగండ్ల పోలీస్ స్టేషన్ – కె. శ్రీరామ్. అదే విధంగా ఆర్‌ఎస్‌ఏఎస్‌టీఎఫ్, అన్నమయ్య జిల్లా – జి. సుబ్బారావు, ఎస్సీ–ఎస్టీ సెల్, అన్నమయ్య జిల్లా – డి. రామాంజనేయుడు నియమితులయ్యారు. సంబంధిత జిల్లాల ఎస్పీలు వెంటనే ఇన్‌స్పెక్టర్లను రిలీవ్ చేసి, కొత్త పోస్టింగ్‌లలో విధుల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని డీఐజీ డా.కోయ ప్రవీణ్ స్పష్టం చేశారు.


