MonaLisa | మోనాలిసా భర్తపై పోక్సో కేసు…

MonaLisa | మోనాలిసా భర్తపై పోక్సో కేసు…
MonaLisa | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మహాకుంభమేళాలో ఇంటర్నెట్ సెన్సేషన్‌గా నిలిచిన ‘మోనాలిసా’ వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. సెలబ్రిటీగా మారిన ఈ యువతి, ప్రస్తుతం న్యాయపరమైన వివాదంలో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది.
మహాకుంభమేళాలో తన అందం, ఆహార్యంతో సోషల్ మీడియాలో వైరల్ అయిన ‘మోనాలిసా’ ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది. ఆమె ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను ప్రేమించి ఇటీవలే వివాహం చేసుకున్న ఈ జంట, ఒక్కసారిగా న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొంటోంది.
ఈ జంటకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో మోనాలిసా వయసుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆమె మైనరా లేక మేజరా అన్న ప్రశ్నలు తలెత్తాయి.
ఈ వ్యవహారంపై నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ (NCST) దృష్టి సారించింది. మోనాలిసా గిరిజన వర్గానికి చెందిన యువతి కావడంతో అధికారులు ప్రత్యేకంగా విచారణ చేపట్టారు.
దర్యాప్తులో మోనాలిసా ఇంకా మైనర్ అనే విషయం బయటపడింది. చట్టబద్ధంగా వివాహం చేసుకునే వయసు ఆమెకు లేదని అధికారులు నిర్ధారించారు. దీంతో ఆమెను వివాహం చేసుకున్న ఫర్మాన్ ఖాన్‌పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
మైనర్ బాలికను వివాహం చేసుకోవడం, లైంగిక నేరాల కిందికి వస్తుందని అధికారులు తెలిపారు. ఇటీవల సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిన ఈ జంట, ఇప్పుడు న్యాయపరమైన చిక్కుల్లో పడటం సంచలనంగా మారింది.
