PMKVY | యువతకు నైపుణ్యాలు..

PMKVY | యువతకు నైపుణ్యాలు..
- జిల్లాకు ఉపాధి అవకాశాలు
- స్కిల్ హబ్ సెంటర్లలో యువతకు శిక్షణ
- ప్రతీ నియోజకవర్గంలో శిక్షణ కేంద్రం ఏర్పాటు
- మూడు నెలలకు ఒకసారి మెగా జాబ్ మేళా ఏర్పాటు
PMKVY | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎనిమిది నైపుణ్య హబ్‌లు, పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక నైపుణ్య కళాశాల స్థాపించి, యువతకు వివిధ రంగాలలో శిక్షణ అందించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ పేర్కొన్నారు .
PMKVY (ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన) ఆధారంగా, IT-ITES, బ్యూటీ & వెల్నెస్, మేనేజ్మెంట్ & ఎంట్రప్రెన్యూర్షిప్, BFSI, అపారెల్, నిర్మాణం, హెల్త్‌కేర్, ఆటోమోటివ్(Healthcare, Automotive), ఫార్మసీ వంటి రంగాల్లో శిక్షణ ఇచ్చి, యువతను పరిశ్రమ అవసరాలకు తగిన నైపుణ్యాలతో సిద్ధం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈ శిక్షణ ద్వారా వారు మంచి ఉద్యోగ అవకాశాలు పొందడంలో సహాయపడిందన్నారు.
కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఉన్నత విద్యాభ్యాసం చేయలేక ఐటీఐ డిప్లమా ఇంటర్, డిగ్రీ, బీటెక్ చేసిన వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలకు సంబంధించినందుకు ప్రభుత్వం స్కిల్ హబ్ కేంద్రాలు(Skill Hub Centers) అండగా నిలుస్తున్నాయి.
ఉచితంగా శిక్షణ పొందే అవకాశం కల్పించడమే కాకుండా వివిధ సంస్థల్లో శిక్షణ తీసుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు సైతం కల్పించడం యువతకు ఇది ఒక మంచి సువర్ణ అవకాశమన్నారు.
శ్రీ సత్య సాయి జిల్లాలో హిందూపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, పెనుగొండలోని ప్రభుత్వ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల, ధర్మవరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్(Polytechnic) కళాశాల, పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం మండల పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీకళాశాలలో, మడకశిర లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో,కదిరిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, హిందూపురంలోనే తెలుగు చేనేత పారిశ్రామిక శిక్షణ కేంద్రంలో, హిందూపురంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు.
పైన తెలిపిన శిక్షణ కేంద్రాలలో సెక్యూరిటీ ఎనలిస్ట్, అప్లికేషన్ డెవలపర్, స్టోరేజ్ ఇంచార్జ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ, సైబర్ సెక్యూరిటీ అండ్ సోషల్ మీడియా అనలిస్ట్, కస్టమర్ కేర్(Customer Care) ఎగ్జిక్యూటివ్, ఫోర్ వీలర్ సర్వీస్ టెక్నీషియన్, ప్లంబర్* మొదలైన వివిధ కోర్సులపైన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
ఈ శిక్షణలో ఆయా నియోజకవర్గాల్లోని శిక్షణ కేంద్రాల్లో కోర్సును బట్టి 45 రోజుల నుంచి మూడు నెలల పాటు నిర్వహించడం జరుగుతుంది. జిల్లాకు చెందిన యువతీ యువకులు వారి నియోజకవర్గంలోని శిక్షణా కేంద్రాల్లో శిక్షణ పొందవచ్చు. మరిన్ని స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.
శ్రీ సత్యసాయి జిల్లాలోని ఆసక్తి కలిగిన యువతీ, యువకులు, www.Naipunyam.ap.gov.in వెబ్సైట్ ద్వారా , ఆయా నియోజకవర్గంలోని శిక్షణా కేంద్రాలను సంప్రదించడం ద్వారా మరియు 9390176421, 93986 43930 , 9966682246 ఫోన్ నెంబర్లను సంప్రదించగలరు.
స్థానిక పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు నైపుణ్యాలను మెరుగు పరచడమే కాకుండా, ప్రతి నియోజకవర్గంలో ప్రతి నెల స్థానిక ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ఒక మెగా జాబ్ మేళా(Job Fair) నిర్వహించి, నియోజవర్గంలోని యువతీ యువకులకు, వివిధ రంగాలకు సంబంధించిన ప్రైవేట్ పరిశ్రమలలో వారికి తగ్గ ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది.
శ్రీ సత్యసాయి జిల్లాలో డిగ్రీ లేదా పోస్టు గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన నిరుద్యోగ యువతీ, యువకులు వారి నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ప్రతి నియోజకవర్గంలో ఒక నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. యువత ఉద్యోగాల కోసం మధ్యవర్తులను సంప్రదించి లక్షలు ఖర్చు చేసి మోసపోతున్నారు.
వాటి బారిన పడకుండా ఈ స్కిల్ సెంటర్ల ద్వారా అందించే నైపుణ్యాభివృద్ధి(Skill Development) శిక్షణ వినియోగించుకుని జిల్లాలోని యువతీ యువకులు ఉపాధి అవకాశాలు అందుపుచ్చుకోవాలి. ఈ సెంటర్ల ద్వారా ఈ సెంటర్ల ద్వారా ఉచిత శిక్షణా మరియుఉపాధి అవకాశాలను అందించడం జరుగుతుంది. జిల్లా యువత మరింత అవగాహన పెంచుకొని స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను పూర్తిగా వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు .
