PMJ Jewels | ఆభరణాల ప్రదర్శన

PMJ Jewels | ఆభరణాల ప్రదర్శన

PMJ Jewels | తాజ్ కృష్ణలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు ప్రదర్శన
10,000కి పైగా ప్రత్యేక ఆభరణాల కలెక్షన్లు
వివాహాలు, హాఫ్-శారీ వేడుకలకు ప్రత్యేక జోన్లు
పర్సనలైజ్డ్ స్టైలింగ్ & ప్రైవేట్ వెడ్డింగ్ గదులు
డైమండ్ టెస్టింగ్ జోన్ ప్రత్యేక ఆకర్షణ
పవిత్రం, సితార వంటి సిగ్నేచర్ కలెక్షన్లు
హాఫ్-శారీ ఫ్యాషన్ షోలో మెరిసిన కొత్త డిజైన్లు
సంప్రదాయం–ఆధునికత కలయికలో PMJ ప్రత్యేకత

PMJ Jewels | హైదరాబాద్, ఆంధ్రప్రభ : పీఎమ్ జ్యువెల్స్ హైదరాబాద్‌కు ఒక ఆకర్షణీయమైన, ఆకట్టుకునే ఆభరణాల అనుభవాన్ని తీసుకువచ్చింది. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో వివాహాలు మరియు వేడుకల కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన ఆభరణాల కలెక్షన్స్, పర్సనలైజ్డ్ స్టైలింగ్ మరియు హాఫ్ శారీ ఫ్యాషన్ షోతో జరుపుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆభరణాల ప్రదర్శన60 ఏళ్లకు పైగా ఘనమైన వారసత్వం కలిగి, దక్షిణ భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన ఆభరణాల బ్రాండ్‌గా గుర్తింపు పొందిన PMJ జ్యువెల్స్, తన అత్యుత్తమ ఆభరణాల కలెక్షన్స్‌లను ప్రదర్శించడానికి సిద్ధమైంది. జనవరి 31 నుండి ఫిబ్రవరి 2 వరకు హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో నిర్వహించే ఈ ప్రత్యేక ప్రదర్శనలో, వివిధ శైలులకు చెందిన 10,000 కంటే ఎక్కువ రకాల ఆభరణాలను ప్రదర్శించనున్నారు.

PMJ Jewels

తన ప్రసిద్ధ తాజ్ కృష్ణ ప్రదర్శనలకు అదనంగా, PMJ జ్యువెల్స్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రదర్శనలలో ఒకదాన్ని నిర్వహిస్తోంది, ఇందులో అద్భుతమైన ఆభరణాల విస్తృత శ్రేణిని ఒకే చోట ప్రదర్శనకు ఉంచారు. ఈ ప్రదర్శన, వివాహాలు, హాఫ్- శారీ మరియు ఇతర శుభకార్యాల కోసం విస్తృతంగా ప్రశంసలు పొందిన, విశాలమైన ఎంపికలను అందించాలనే లక్ష్యంతో ఎప్పటినుంచో ముందుకు సాగుతున్న బ్రాండ్ యొక్క అసలైన లక్ష్యాని ప్రతిబింబిస్తోంది. భారతీయ సంప్రదాయాలు మరియు వారసత్వాన్ని కలుపుకుంటూ, PMJ జ్యువెల్స్ పాత ప్రపంచంలోని గొప్ప సాంప్రదాయ హస్తకళలను జరుపుకునే, ఆధునిక సౌందర్యంతో కలసిన ఆభరణాలను నిరంతరం అందిస్తోంది.

PMJ Jewels గత 60 సంవత్సరాలకు పైగా మా కస్టమర్ల జీవితాల్లోని అత్యంత ముఖ్యమైన క్షణాలలో భాగమై ఉంది,” అని PMJ Jewels చైర్మన్ శ్రీ కుషాల్ కాంకారియా తెలిపారు. “ఈ ప్రదర్శనలో సంప్రదాయ అంశాలను కాపాడుతూ, ఆధునిక జీవనశైలికి అనుగుణంగా అర్థవంతమైన భావాన్ని వ్యక్తపరిచే డిజైన్లను ఒకేచోట అందిస్తున్నాము. ఇప్పటికే మమ్మల్ని సందర్శించిన వారికి ఇది పంచుకున్న జ్ఞాపకాల వేడుక, మరియు మొదటిసారి PMJ జ్యువెల్స్‌ను తెలుసుకునే వారికి ఇది మా హస్తకళా నైపుణ్యాన్ని మరియు విలువలను అనుభవించమని ఇచ్చే ఆహ్వానం.”

PMJ Jewels

ఒక యువతీ మొదటి హాఫ్-శారీ వేడుకల నుంచి, వివాహాలు, వార్షికోత్సవాలు, అలాగే తరతరాలకు అందే వారసత్వ ఆభరణాల వరకూ, PMJ Jewels దశాబ్దాలుగా అనేక కుటుంబాల జీవితాల్లోని ప్రత్యేక మైలురాళ్లలో భాగమై ఉంది. ఈ ప్రదర్శన తనదైన రీతిలో ఒక మైలురాయిగా నిలవడం ఎంతో సముచితం. ఇది ఒక జ్యువెలర్‌గానే కాకుండా, కుటుంబ సంప్రదాయాలుగా మరియు తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోయే జీవితంలోని విశేష ఘట్టాలలో భాగస్వామిగా PMJ స్థానాన్ని మరోసారి నిలుపుకుంది

ప్రదర్శనలో ఏమి ఆశించవచ్చు:వివాహాలు, వివాహానికి ముందు మరియు తరువాత జరిగే వేడుకలు, హాఫ్-శారీ కార్యక్రమాలు వంటి వివిధ సందర్భాల కోసం ప్రత్యేకంగా ఏర్పటుచేసిన అనుభూతి పరమైన జోన్లు ఏర్పాటు చేయబడగా, అందులో 2 ప్రత్యేక ప్రైవేట్ వెడ్డింగ్ ప్రత్యేక గదులు కూడా ఉన్నాయి. అతిథులు వారికి నచ్చినట్లుగా మరియు ప్రతి వేడుకకు సరిపోయే ఆభరణాలను ఎంపిక చేసుకోవడంలో సహాయపడటానికి, వేదిక వద్ద వృత్తిపరమైన స్టైలిస్టులు అందుబాటులో ఉంటారు. పారదర్శకత మరియు నమ్మకాన్ని పెంపొందించడానికి ఒక ప్రత్యేకమైన ‘డైమండ్ టెస్టింగ్ జోన్’ ఇక్కడ కస్టమర్లు తాము కొనుగోలు చేసే సహజ సిద్ధమైన వజ్రాల నాణ్యతను మరియు విశ్వసనీయతను స్వయంగా పరీక్షించుకోవచ్చు.

ఈ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణలుగా సిగ్నేచర్ డైమండ్, కలర్డ్ జెమ్‌స్టోన్ కలెక్షన్స్ మరియు సాంప్రదాయ పోల్కీ కలెక్షన్లు నిలుస్తాయి. ఇవి భారతీయ కళా నైపుణ్యాన్ని మరియు ఆధునిక హస్తకళను కలిపి రూపొందించబడ్డాయి. పవిత్రం కలెక్షన్’లో దైవత్వం ఉట్టిపడేలా రూపొందించిన అద్భుతమైన ఆభరణాలు కొలువుదీరాయి. ఇందులో రాధా-కృష్ణ నెక్లెస్‌లు, బాలాజీ చోకర్లు, లక్ష్మీదేవి మరియు సరస్వతీ దేవి రూపాలు చెక్కిన పెండెంట్లు, మంగళసూత్రాలు, పాపిడి బిళ్లలు, చెవి కమ్మలు మరియు విలువైన రత్నాలతో పొదిగిన దైవ రూపాల ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి భారతీయ పవిత్ర శిల్పకళ మరియు చారిత్రక దేవాలయాలైన పద్మనాభస్వామి, కోణార్క్, మరియు మల్లికార్జున ఆలయాల నుండి స్ఫూర్తి పొంది రూపొందించిన ఈ కలెక్షన్, డిజైన్ల ద్వారా ఒక కథను వివరించే PMJ జ్యువెల్స్ విశిష్ట నైపుణ్యాన్ని చూపుతుంది.

సితార కలెక్షన్ ప్రత్యేకంగా దక్షిణ భారతీయ కుటుంబాలలో ఒక ముఖ్యమైన ఘట్టమైన, అమ్మాయిలు యవ్వనదశలోకి అడుగుపెట్టడాన్ని సూచించే హాఫ్-శారీ వేడుకల కోసం రూపొందించబడింది. ప్రకృతి మరియు విశ్వం నుంచి ప్రేరణ పొందిన ఈ కలెక్షన్, ప్రాచీన దక్షిణ భారత శిల్పకళను ఆధారంగా తీసుకుని, సంప్రదాయ చిహ్నాలను జాగ్రత్తగా రూపొందించిన క్లిష్టమైన వివరణలతో మిళితం చేస్తుంది.

ప్రదర్శన ప్రారంభానికి ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో, PMJ జ్యువెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ కంకారియా గారు ప్రసంగించారు. దీని తర్వాత, PMJ జ్యువెల్స్ కస్టమర్ల పిల్లలతో ఒక ప్రత్యేక ఫ్యాషన్ షో జరపబడింది, ఇందులో కొత్తగా వచ్చిన కలెక్షన్‌ను ప్రదర్శించారు. ప్రముఖ హైదరాబాదీ ఫ్యాషన్ డిజైనర్ భార్గవి కూనం గారితో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. హస్తకళా నైపుణ్యంతో కూడిన లగ్జరీ డిజైన్‌లకు పేరుగాంచిన ఆమె, ఆభరణాల అందాన్ని మరింతగా పెంచేలా ఈ దుస్తులను ఎంతో ఆలోచనాత్మకంగా రూపొందించారు బ్రాండ్ అంబాసిడర్ సితార ఘట్టమనేని కూడా ఈ ప్రదర్శన మరియు షోలో పాల్గొన్నారు. కస్టమర్‌లతో తమకు ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని గౌరవిస్తూ PMJ జ్యువెల్స్ చేపట్టిన ఒక గొప్ప ప్రయత్నం ఇది. తీపి జ్ఞాపకాలను పదిలపరుస్తూనే, తమ బ్రాండ్ యొక్క ‘పీపుల్-ఫస్ట్’ అనే సిద్ధాంతాన్ని ఈ కార్యక్రమం మరోసారి చాటిచెప్పింది.

భారతదేశం మరియు అమెరికాలో 45కి పైగా స్టోర్‌లను కలిగి ఉన్న PMJ జ్యువెల్స్ ఇంకా ఇది నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది, అయినప్పటికీ తరతరాల నమ్మకాన్ని సంపాదించిపెట్టిన విలువలకు కట్టుబడి ఉంటుంది. సాంప్రదాయ హస్తకళా నైపుణ్యాన్ని, నేటి కాలానికి తగ్గ ఆధునిక డిజైన్లతో మరియు అత్యుత్తమ వ్యక్తిగత సేవలతో మేళవించడం ద్వారా ఈ బ్రాండ్ నేడు ధరించడానికే కాకుండా, జీవితాంతం ఒక నిధిలా దాచుకునే ఆభరణాలకు పర్యాయపదంగా మారింది.

CLICK HERE TO READ హిందాల్కో బహుళ నైపుణ్య శిక్షణ కేంద్రం ప్రారంభం

CLICK HERE TO READ MORE

Leave a Reply