PM Modi | భవిష్యత్‌కు రోడ్‌మ్యాప్‌

PM Modi | భవిష్యత్‌కు రోడ్‌మ్యాప్‌

  • బడ్జెట్‌లో ఆత్మనిర్భర్‌ భారత్‌కు కేటాయింపులు
  • త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌
  • కేంద్ర బడ్జెట్‌ : ప్రధాని మోదీ

PM Modi | వెబ్‌డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : కేంద్ర బడ్జెట్‌ భవిష్యత్తుకు రోడ్‌మ్యాప్‌గా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2047 మిషన్‌ లక్ష్యాల మేరకు కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టామన్నారు. త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. లోక్​సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ బడ్జెట్​ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ప్రధాని ఈ మేరకు వ్యాఖ్యానించారు.

“ఇవాళ చరిత్రాత్మక బడ్జెట్‌ ప్రవేశపెట్టామ‌ని, బడ్జెట్‌లో ఆత్మనిర్భర్‌ భారత్‌కు కేటాయింపులు. కేంద్ర బడ్జెట్‌ ద్రవ్యలోటును నియంత్రిస్తుంది. మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్‌లో మరింత ఊతమిచ్చాం. లోకల్‌ నుంచి గ్లోబల్‌ స్థాయికి భారత్‌ ఎదిగింది. యువశక్తిని ప్రోత్సహించే విధంగా బడ్జెట్‌ ఉంది. యువతకు గేమింగ్‌, టూరిజం, క్రీడా సౌకర్యాలు. వికసిత్‌ భారత్‌ ప్రయాణం వేగవంతానికి బడ్జెట్‌ తోడ్పాటు. సంస్కరణలకు బడ్జెట్‌ నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది. భారత్‌ను డేటా సెంటర్‌గా మార్చేందుకు ట్యాక్స్‌ హాలిడే. ఇది భారత్‌ను డేటా సెంటర్‌ హబ్‌గా మారుస్తుంది. ఉద్యోగాల కల్పనకు కేంద్ర బడ్జెట్‌ మరింత దోహదం చేస్తుంది. కేంద్ర బడ్జెట్‌ నారీశక్తిని ప్రతిబింబిస్తుంది. బడ్జెట్‌లో ఈశాన్య ప్రాంతాల పర్యాటకంపై దృష్టి పెట్టామ‌ని ” ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

Leave a Reply