త్వరితగతిన పూర్తి చేయండి

త్వరితగతిన పూర్తి చేయండి

ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వం గూడు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలనే లక్ష్యంతో మంజూరు చేసిన ఇండ్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని నారాయణపేట జిల్లా(Narayanapet District) గృహ నిర్మాణ శాఖ పిడి శంకర్ అన్నారు. ఈ రోజు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని కొల్లూర్, ఊట్కూర్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా పిడి మాట్లాడుతూ.. నారాయణపేట జిల్లా వ్యాప్తంగా 6430 ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా 4594 ఇండ్లు ప్రారంభించారు. 2996 ఇండ్లు పునాదులు వేయగా, 443 ఇండ్లు స్లాబ్లు లెవెల్(Slabs Level) చేపట్టారు. 7157 ఇండ్లు నారాయణపేట జిల్లాకు కేటాయించగా కలెక్టర్ ఆదేశాల మేరకు పనులు వేగవంతంగా చేపట్టేందుకు గ్రామాల్లో పర్యవేక్షిస్తున్నామని అన్నారు. జిల్లాలో 5 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసినట్లు వివరించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం(Construction of Indiramma Houses) చేపట్టిన లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు చెల్లించాలని అధికారులను ఆదేశించారు.

ఇందిరమ్మ కమిటీ సభ్యులను భాగస్వామ్యం చేస్తూ ఇండ్ల నిర్మాణం వేగవంతంగా చేపట్టాలన్నారు. ఇండ్లు మంజూరైన లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పనులు త్వరగా పూర్తి చేసే విధంగా చూడాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పురోగతి కనిపించే విధంగా అధికారులు బాధ్యతాయుతంగా పని చేస్తూ బిల్లుల చెల్లింపులో జాప్యం లేకుండా చూడాలని ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.

ఇండ్ల నిర్మాణం చేపట్టాలి. లబ్ధిదారుల జాబితా తయారు చేసి, వారు వెంటనే పనులు చేపట్టే విధంగా చూడలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయలక్ష్మి(MPDO Vijayalakshmi), సూపర్డెంట్ కొండన్న, పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాసరావు, తాజోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply