Play Ground | ప్లేగ్రౌండ్ పరికరాలు అంద‌జేత‌..

Play Ground | ప్లేగ్రౌండ్ పరికరాలు అంద‌జేత‌..

Play Ground | అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట మల్లికార్జున వనవాసి ఆవాసంలో నివసిస్తున్న చెంచు విద్యార్థులకు అమెరికా బుల్ డాగ్స్(American Bulldogs) సహకారంతో ప్లే గ్రౌండ్ పరికరాలు అందజేశారు. న్యూయార్క్‌లో నివసిస్తున్న తాడూరు వాసి జనుంపల్లి ప్రసన్న హామీ మేరకు, ఆరు ఆట పరికరాల కోసం రూ.90,000ల(Rs. 90,000)ను స్వచ్ఛందంగా సమీకరించి పంపించారు.

నూతన సంవత్సరం కానుకగా ఈ పరికరాలను కమిటీ సభ్యులు, సత్యసాయి యోగా కమిటీ సమక్షంలో విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రేయోభిలాషులకు ఆవాస ఇంచార్జ్ గట్టు అశోక్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply