ఏటా రూ.10వేల కోట్లతో అభివృద్ధి
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర పనరులు, అవకాశాలపై ప్రచారం బాధ్యత నరెడ్కోపై ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhati vikramarka) అన్నారు. అన్నివైపులా హైదరాబాద్ అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని చెప్పారు. ఈ రోజు నరెడ్కో ఆధ్వర్యంలో హైటెక్స్లో ప్రా నిర్వహిస్తున్న కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ప్రార నరెడ్కో బ్రౌచర న్ను వారు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధికి ఏటా రూ.10 వేలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. గత రెండేళ్లలో రూ.20 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్డుతో ముఖ చిత్రం మార్చబోతున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను కలిసేలా దీని నిర్మాణం ఉంటుందన్నారు. ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాలు, చెరువులను హైడ్రా కాపాడుతోందని వివరించారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందని ప్రచారం చేస్తున్నారని, రాయదుర్గంలో ఎకరా రూ. 177 కోట్ల ధర పలకడంతో నగర అభివృద్ధి ఎలా దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం హైదరాబాద్లో ఎలక్ట్రిక్ బస్సులను నడిపిస్తున్నామన్నారు. నగరం నలువైపులా మెట్రోను విస్తరిస్తున్నామన్నారు. విల్లాలు హై రైజ్ బిల్డింగులకే పరిమితం కావొద్దని, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలను దృష్టిలో పెట్టుకొని నిర్మించాలని సూచించారు.