Plane Crash | ప్రాణాలు కాపాడిన 10 నిమిషాలు !!

అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదం అందరినీ షాక్‌కు గురిచేసింది. మెడికల్‌ విద్యార్థుల హాస్టల్ పై విమానం కూలిపోవడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది. ఈ ఘటనలో 200 మందికి పైగా మరణించారు. అయితే, ఈ ప్రమాదం సమయంలో ట్రాఫిక్‌ కారణంగా విమానాన్ని మిస్‌ అయిన ఓ మహిళ (భూమి చౌహాన్‌) అదృష్టవశాత్తూ ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది.

భూమి చౌహాన్ మాట్లాడుతూ.. “లండన్‌కు వెళ్లాల్సిన నా విమానం 10 నిమిషాల తేడాతో మిస్‌ అయ్యింది. అదే నా ప్రాణాలను కాపాడింది,” అంటూ ఆమె భయంతో, ఉద్వేగంతో చెప్పారు.

“నాకు ఇప్పటికీ గబగబలేస్తోంది. శరీరం వణికిపోతుంది. మాట్లాడలేకపోతున్నాను.దేవుడే నన్ను కాపాడాడు” అంటూ ఆమె భావోద్వేగంతో తెలిపారు. ఈ ఘటన తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని పేర్కొన్నారు.

Leave a Reply