మేడిపల్లి, (ఆంధ్రప్రభ): మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 3 వ డివిజన్ పర్వతాపూర్ సర్వే నంబర్ 1 లో బుధవారం హైడ్రా కమిషనర్ పర్యటించి మైనార్టీల గ్రేవ్ యార్డ్ అక్రమనకు గురైనదని బాధితుల ద్వారా తెలుసుకుని రెండు రోజులలో సమస్య పరిష్కకరిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు.
గురువారం ఉదయమే హైడ్రా యాక్షన్ పీర్జాదిగూడలో ప్రారంభమైంది. కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో హైడ్రా సీఐ సైదులు ఆధ్వర్యంలో, అక్రమ నిర్మాణాలు నెలమట్టం చేశారు. ఇండ్లలో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించి అక్కడ నిర్మించిన ఇండ్లను కూల్చివేశారు. గత కొన్ని సంవత్సరాలుగా గ్రేవ్ యార్డ్ భూమిని కాపాడాలని పలువురు అధికారులకు, నాయకులకు మోర పెట్టుకున్నారు.
అయినా ఎవరూ పట్టించు కోలేదు. కానీ, హైడ్రా చీఫ్ రంగనాథ్ కేవలం 24 గంటల్లోనే ఆక్రమణలకు చెక్ పెట్టారు.