Phone Tapping Case | ప్రభాకర్‌రావుకు బిగుస్తున్న ఉచ్చు – పాస్‌పోర్ట్ ర‌ద్దు

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణలో తీవ్ర సంచ‌ల‌నం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు క్లైమాక్స్‌కు చేరుకోనుంది. ఈ కేసులో కీలక నిందితుడు, మాజీ పోలీసుల అధికారి ప్రభాకర్‌రావు పాస్‌పోర్ట్ ను రద్దు చేసింది పాస్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీసులకు తెలిపారు. కీలక నిందితుడి పాస్‌పోర్ట్ రద్దు కావడంతో అమెరికాలో ప్రభాకర్‌రావుకు గ్రీన్‌కార్డు వ‌చ్చే అవ‌కాశం లేదు.

హైద‌రాబాద్‌కు ప్ర‌భాక‌ర్‌…?
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్ర‌ధాన నిందితుడు ప్రభాకర్ రావు ను ర‌ప్పించేందుకు హైద‌రాబాద్ పోలీసులు చ‌ర్య‌లు చేప‌ట్టారు. అమెరికా కాన్సులేట్-విదేశీ వ్యవహారాల శాఖ సహకారంతో ఆయన్ని ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నాలు తీవ్రతరం చేశారు. పాస్‌పోర్టు రద్దు కావడంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఇండియాకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కేసులో ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయిన సంగ‌తి విదిత‌మే.

Leave a Reply