Phone tapping case | సిట్ ఏర్పాటు..

Phone tapping case | సిట్ ఏర్పాటు..
Phone tapping case, హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఫోన్ ట్యాపింగ్ కేసులో మరింత లోతైన విచారణ చేపట్టాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సిట్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో 9 మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేశారు. ఇందులో రామగుండము సీపీ ఆంబరి కిషోర్ జా, సిద్ధిపేట సీపీ విజయ్ కుమార్, మాదాపూర్ డీసీపీ రితి రాజ్, మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి, గ్రే హౌండ్స్ గ్రూప్ కమాండర్ రవీందర్ రెడ్డి, రాజేంద్రనగర్ అడిషనల్ డీసీపీ కెఎస్ రావు. జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకట్, డీఎస్పీలు శ్రీధర్, నాగేందర్ రావు లను నియమించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరింత లోతైన ఇన్వెస్టిగేషన్ కు డీజీపీ కీలక నిర్ణయం తీసుకున్నారు.
