Petition | కుక్కల నుంచి కాపాడండి..

Petition | గూడూరు, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా గూడూరు మండలంలోని మల్లవోలు గ్రామంలో ఇటీవల పెద్దఎత్తున వీధి కుక్కలు పెరిగిపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గ్రామ పరిధిలో తిరుగుతున్న కుక్క పిల్లలు, మహిళలు, వృద్ధులకు ప్రమాదకర పరిస్థితులను సృష్టిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో కుక్కలు వెంటపడి దాడి చేసిన ఘటనలు చోటుచేసుకోవడంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ప్రజల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని అంతర్జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ యూత్ ప్రెసిడెంట్ మోహన్ త్రినాధ్ స్పందించి, ఈ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం సమర్పించారు.

గ్రామ ప్రజల భద్రత దృష్ట్యా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు. గ్రామ ప్రజలు కూడా సంబంధిత శాఖలు వెంటనే స్పందించి కుక్కలను పట్టించడం, టీకాలు వేయించడం, శస్త్రచికిత్సలు చేయించడం వంటి చర్యలు చేపట్టి ప్రజలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ప్రాణ భద్రతను కాపాడే దిశగా ప్రభుత్వం వెంటనే స్పందించాలి అన్నారు.

Leave a Reply