petition | షెడ్డు నిర్మించాలని చైర్మన్ కు వినతి

petition | జైనూర్, ఆంధ్రప్రభ : జై జంగు జై లింగు దిక్షాపరుల సౌకర్యార్థం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని రావుజిగూడ గ్రామంలో షెడ్డు నిర్మించాలని కోరుతూ దీక్షాపరులు ఇవాళ జైనూర్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కుడిమెట్ విశ్వనాథ్ రావుకు కలిసి వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం గ్రామాల్లో షెడ్యూల్ నిర్మిస్తుందని, దానిలో భాగంగా తమ గ్రామం రాజుకులలో షెడ్డు నిర్మిస్తే భక్తులకు ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని వారు ఇచ్చిన వినతి పత్రంలో కోరారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ… షెడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భూర్నూర్ సర్పంచ్ పెందూర్ గణపత్, కాంగ్రెస్ పార్టీనాయకులు మెస్రం అంబాజీరావు, ఆత్రంజాలింషా, కుమ్ర శ్యామ్ రావు, ఆత్రం అనిల్ , భూపతి, దీక్షాపరులు, తదితరులు పాల్గొన్నారు.
