శరవేగంగా పేరేచర్ల  హైవే పనులు…!

రూ.881.61 కోట్లతో పనులు ప్రారంభించిన  కాంట్రాక్టర్‌..!

 ( పల్నాడు , ఆంధ్రప్రభ ప్రతినిధి) :

ఆంధ్రప్రదేశ్‌ లో జాతీయ రహదారి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ ఏపీ రాజధాని అమరావతి  అనుసంధానం యేసే హైవే పనులు  శరవేగంగా జరుగుతున్నాయి.  పల్నాడు జిల్లాలో కీలక  పేరేచర్ల.. -కొండమోడు నేషనల్‌ హైవేకు కేంద్రం నిధులు మంజూరు చేసింది. కూటమి ప్రభుత్వం చొరవతో నిధుల విడుదలలో సమస్యలు తొలగిపోయాయి. ఈ మేరకు కాంట్రాక్ట్‌ సంస్థ రూ.881.61 కోట్లతో పనులు చేపట్టి నిర్వహిస్తోంది. ఈ నేషనల్‌ హైవే పూర్తయితే అమరావతితో పాటు-గా గుంటూరు, పల్నాడు ప్రాంతాల ప్రజలు హైదరాబాద్‌ వైపు వెళ్లేందుకు చాలా ఉపయోగకరంగా ఉంటు-ందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న పేరేచర్ల-కొండమోడు రోడ్డు చాలా దారుణంగా ఉడటంతో.. గుంటూరు నుంచి హైదరాబాద్‌ వెళ్లాలనుకునేవారు విజయవాడ వెళ్లి అక్కడ నుంచి వెళుతున్నారు. పల్నాడు ప్రాంతంలోని వారు నరసరావుపేట, నకరికల్లు మీదుగా గురజాల, మాచర్ల మీదుగా హైదరాబాద్‌ వెళుతున్నారు. ఇలా వెళితే చాలా దూరమై పోతుందని.. ఎక్కువ సమయం పడుతోందని.. చాలా వ్యయంతో కూడిన అంశంగా ప్రయాణికులు పేర్కొంటు-న్నారు.

ఈ హైవే విస్తరణ ఇలా  ..

ప్రస్తుతం పేరేచర్ల-కొండమోడు రోడ్డు 7 నుంచి 10 మీటర్ల వెడల్పు మాత్రమే ఉంది. ఈ కారణంగా ఆ రోడ్డులో వాహనాల రద్దీ పెరిగి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకే ఈ హైవేను నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. ఒక్కొక్క వైపు 8.75 మీటర్ల వెడల్పు ఉంటు-ంది.. మధ్యలో డివైడర్‌ 1.5 మీటర్లు, రెండువైపులా మార్జిన్లు కలిపి మొత్తం 22.5 మీటర్ల వెడల్పుతో విస్తరిస్తున్నారు. ఈ హైవేలో మేడికొండూరు, సత్తెనపల్లి, కొండమోడు వద్ద బైపాస్‌ల నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికే పేరేచర్ల – కొండమోడు రోడ్డుకు సంబంధించి గుంటూరు, సత్తెనపల్లి ఆర్డీవోల పరిధిలో భూమిని కూడా సేకరించారు. పల్నాడు జిల్లా, సత్తెనపల్లి ఆర్డీవో పరిధిలో ఆయ మండలాల్లోని కొన్ని గ్రామాల్లో ఈ రోడ్డుకు సంబంధించి 3డీ ప్రకటన ఇచ్చారు.. అలాగే అవార్డు ప్రకటించారు. ఈ మేరకు పరిహారాన్ని రైతుల బ్యాంక్‌ అకౌంట్‌లకు జమ చేశారు. భూసేకరణ పూర్తి కావడంతో నరసరావుపేట పార్లమెంటు- సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, యరపతినేని శ్రీనివాసరావు, భాష్యం ప్రవీణ్‌ లు రోడ్డు విస్తరణ పనులకు ఈ హైవేపై రెడ్డిగూడెం వద్ద శంకుస్థాపన చేశారు. దీంతో కాంట్రాక్టర్‌ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టి, ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించే కార్యక్రమాన్ని దాదాపు పూర్తి చేశారు. రోడ్డు విస్తరణ పనులు శరవేగంగా నిర్వహించేందుకు ఇటు- కాంట్రాక్టర్‌, అటు- నేషనల్‌ హైవేస్‌ అధికారులు పూర్తిగా సంసిద్ధంగా ఉన్నట్లు- చెప్పకనే తెలుస్తోంది.

కలెక్టర్‌  సూచనల మేరకు….!!

భారీ యంత్రాలతో రోడ్డు కిరువైపులా గ్రావెల్‌ పరిచి చదును చేస్తున్నారు. రోడ్డు విస్తరణ ఎడ్జి వరకు కూడా ఈ పనులు పూర్తి చేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ కృత్తికా శుక్ల సూచనల మేరకు తొలుత కొండమోడు నుండి సత్తెనపల్లి వరకు రోడ్డు విస్తరణ పనులను శరవేగంగా పూర్తి చేసేలా చూడాలని కాంట్రాక్టర్లను, హైవే అధికారులను ఆదేశించారు. ఇటీ-వల జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కలెక్టర్‌ శుక్ల హైవే అధికారులకు ఈ సూచనలు చేసినట్లు- తెలిసింది. కొండమోడు -సత్తెనపల్లి మధ్య రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో పనులను శరవేగంగా చేపట్టి పూర్తి చేసేందుకు సంసిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ చెప్పడం జరిగింది. మరోవైపు బైపాస్‌ పనులను కూడా కాంట్రాక్టర్లు ప్రారంభించారని తెలుస్తోంది. కొండమోడు, సత్తెనపల్లి వద్ద బైపాస్‌ నిర్మాణాలను హైవే కాంట్రాక్టర్లు శరవేగంగా నిర్వహిస్తున్నారు.

Leave a Reply