- డీఎస్పీ కృష్ణ కిషోర్
నర్సింహులపేట, ఆంధ్రప్రభ : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో పాటు అన్ని రాజకీయ పార్టీల నేతలు, ప్రజలంతా సహకరించాలని తొర్రూర్ డీఎస్పీ కృష్ణ కిషోర్ తెలిపారు. ఆదివారం నర్సింహులపేట మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో ఎన్నికల నిర్వహణలో భాగంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులకు ఆయన అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పూర్తి నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదని, సామాజిక మాధ్యమాలలో తప్పుడు సమాచారం షేర్ చేయకూడదని స్పష్టం చేశారు. ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించకూడదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రమేష్ బాబు, ఎంపీఓ కిన్నర యాకయ్య, సిఐ గణేష్, ఎస్సై మాలోత్ సురేష్, వివిధ రాజకీయ పార్టీల నేతలు, అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.

