People Pulse | ఇప్పటికిప్పుడే ఎల‌క్స‌న్స్ వ‌స్తే! మళ్లీ ఆ పార్టీకే అధికారం


దేశంలో మారుతున్న‌ పొలిటిక‌ల్ సీన్‌
ఇప్ప‌టికంటే ఇంకా తగ్గనున్న కాంగ్రెస్ సీట్లు
ఎన్డీఏ కూట‌మిపై పెరిగిన ప్ర‌జ‌ల న‌మ్మ‌కం
మ‌హారాష్ట్ర‌, హ‌ర్యానా, ఢిల్లీ ఎన్నిక‌లే నిద‌ర్శ‌నం
ఇండియా టుడే- సీ ఓటర్ సర్వేలో తేలింది ఇదే

సెంట్ర‌ల్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ‌:

దేశంలో ఇప్పటికిప్పుడే ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ సొంతంగానే సాధారణ మెజారిటీ సాధించనుంది. అంతేకాకుండా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి 343 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. 2024లోక్ సభ ఎన్నికల్లో 232 సీట్లు గెలిచిన ఇండియా కూటమి 188 సీట్లకు పడిపోతోందని ఇండియూ టుడే – సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వెల్లడించింది. 2025 జనవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి 9వ తేదీ వరకు ఈ సర్వే నిర్వహించారు. దేశంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లోని 1,25,123 మందిని సర్వే చేశారు. తాజా సర్వే ప్రకారం ఎన్డీఏ కూటమి ఓటు షేర్ మూడు శాతం పెరిగే అవకాశం ఉంది. ఇక ఇండియా కూటమి 1 ప‌ర్సంట్ ఓటు శాతం పెరిగే చాన్స్ ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి 281సీట్లు వస్తాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి 2024 ఎన్నికల్లో 99 స్థానాలు దక్కాయని ఆ స‌ర్వే నివేదిక‌లో వెల్ల‌డించారు.

చంద్ర‌బాబు, నితీష్ అండ‌తో..

కాంగ్రెస్ పార్టీ పార్టీ 99 స్థానాల నుంచి 78 స్థానాలకు పడిపోవచ్చని ఈ సర్వే తెలిపింది. బీజేపీకి గత ఎన్నికల్లో 41 శాతం ఓట్లు వచ్చాయి. అయితే.. అవి మరో 3 శాతం పెరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఓట్ల శాతం 20కి పడిపోయే చాన్స్ ఉంది. 2024ఎన్నికల్లో 400 ఎంపీ సీట్లను టార్గెట్‌గా ఎన్డీఏ బరిలోకి దిగింది. కానీ, ఆ పార్టీకి ఆశించిన స్థానాలు దక్కలేదు. బీజేపీకి కూడా సీట్లు తగ్గాయి. చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ, నితీష్ కుమార్ నాయకత్వంలో జేడీయూ మద్దతుతో మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 400 సీట్లు ఎన్డీఏకు రాలేదు. దీంతో విపక్షాలు అప్పట్లో మోదీ, బీజేపీపై విమర్శలు చేశాయి. దళిత, ఓబీసీ ఓట్లను కాంగ్రెస్ దూరం చేసింది. ఆరు నెలల తర్వాత పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీలో బీజేపీ కూటమి విజయం సాధించింది. ఈ విజయాలు ఎన్డీఏ కూటమికి రాజకీయంగా కలిసి వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *