ఎన్నికుట్రలు ప‌న్నినా వైసీపీని ప్రజ‌లు న‌మ్మరు

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఉల్లి రైతుల‌ను అడ్డం పెట్టుకొని వైసీపీ(YCP) నేత‌లు డ్రామాలు ఆడుతున్నార‌ని రాష్ట్ర ప‌రిశ్రమ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ అన్నారు. ఉల్లి ధ‌ర‌ల విష‌యంలో వైసీపీ వైఖ‌రిని ఆయన తీవ్రంగా(seriously) ఖండించారు.

త‌మ ప్రభుత్వం టన్ను ఉల్లిని రూ.1200 కొనుగోలు చేస్తోందని, ఇదివ‌ర‌కే సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయాన్నిప్రక‌టించారని గుర్తు చేశారు. అయిన‌ప్పటికీ వైసీపీ నేత‌లు ఈ విష‌యంలో రాజ‌కీయం చేస్తున్నార‌ని అన్నారు.

క్షేత్ర స్థాయి(field level)లో ఏమైనా ఇబ్బందులు ఉంటే రైతుల‌కు న‌ష్టం లేకుండా చూసుకునేందుకు ప్రభుత్వం అన్నివిధాలా చ‌ర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు. గ‌డిచిన ఎన్నిక‌ల్లో ప్రజ‌లు ఛీ కొట్టినా వైసీపీ నాయ‌కుల‌కు ఇంకా బుద్దిరాలేద‌న్నారు.

ఒక‌వైపు సంక్షేమ కార్యక్రమాలు అమ‌లు(implementation)చేస్తూ, మ‌రోవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబునాయుడు అహ‌ర్నిశ‌లు క‌ష్టప‌డుతున్నార‌ని, ఇది చూసి త‌ట్టుకోలేని వైసీపీ నాయ‌కులు ప్రతి విష‌యాన్నిరాజ‌కీయం(politics) చేసేందుకు డ్రామాలు ఆడుతున్నార‌ని మండిప‌డ్డారు.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్లు రైతుల‌ను ప‌ట్టించుకోలేద‌న్నారు. ఇప్పుడు ఏ ప‌ని లేకుండా కేవ‌లం రైతుల‌ను అడ్డం పెట్టుకొని ప్రభుత్వంపై బుర‌ద‌ జ‌ల్లేందుకు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నార‌ని ధ్వజ‌మెత్తారు.

ఉల్లి స‌మ‌స్యను సీఎం చంద్రబాబు(CM Chandrababu) నాయుడు ఎప్పటి క‌ప్పుడు ప‌ర్యవేక్షిస్తున్నార‌న్నారు. వైసీపీ అంటే డ్రామా.. డ్రామా అంటే వైసీపీ అని ఆయ‌న‌ ఎద్దేవా చేశారు. ఎలాంటి స‌మ‌స్య లేకున్నాఏదో ఉన్నట్టు సృష్టించ‌డంలో వైసీపీ నేత‌లు ఆరితేరార‌ని మంత్రి టీ.జీ భ‌ర‌త్(Minister T.G. Bharat) పేర్కొన్నారు. పేప‌ర్ ఉంది క‌దా అని ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయ‌డం స‌రైంది కాద‌న్నారు. త‌మ ప్రభుత్వం చేస్తున్నమంచి ప‌నుల‌ను ప్రజ‌లు గ‌మ‌నిస్తూ ఉన్నార‌న్నారు.

Leave a Reply