Pensions | జైనూర్ గ్రామ అభివృద్ధే నా లక్ష్యం

Pensions | జైనూర్ గ్రామ అభివృద్ధే నా లక్ష్యం
- ఒక్క అవకాశం ఇవ్వండి. అభివృద్ధి చేస్తా
Pensions | జైనూర్, ఆంధ్రప్రభ : కొమురం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా అవకాశం ఇవ్వండి, అభివృధి చేసి చూపడమే నా లక్ష్యమని జైనూర్ పంచాయితీసర్పంచ్ అభ్యర్థి కనకగంగారాం అన్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుత అన్నారు.
గ్రామంలో నెలకొన్న సమస్యలను గెలిచిన త్వరగా పరిష్కరిస్తానని(will solve) అన్నారు. అలాగే గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ లు(Pensions), రేషన్ కార్డ్ లు అందేలా కృషి చేస్తానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. గ్రామంలో ప్రతి వార్డులోకి సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేపిస్తానని, విద్యుత్ దీపాలు, విద్య వైద్యం పై ప్రత్యేక దృష్టి పెడుతమని, పదవ తరగతి, ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసి, వారిని ప్రోత్సహిస్తా మన్నారు.
వార్డు సభ్యులతో కలసి పనిచేసి, గ్రామాన్నిపరిశుభ్రంగా ఉంచుతూ ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతానని జిల్లాలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుత అన్నారు. ఈనెల 11న జరిగే ఎన్నికలలో తనకు పంచాయతీ ప్రజలు ఆశీర్వదించి ఎన్నికల గుర్తైనా బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పంచాయతీ ప్రజలను వేడుకుంటున్నారు.
