నూతన కలెక్టర్ ను సన్మానించిన పెన్షనర్లు..

నూతన కలెక్టర్ ను సన్మానించిన పెన్షనర్లు..
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కలెక్టర్ అనురాగ్ జయంతిని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆ సంఘం ప్రతినిధులు కలిసి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. జిల్లా అధ్యక్షులు బొమ్మ కంటి బాలరాజు, ప్రధాన కార్యదర్శి కడారు రమేష్ బాబు, జిల్లా మాజీ సైనిక విభాగ అధ్యక్షులు పోలి శంకర్ రెడ్డి, టి ఏ పీ ఆర్ పి ఏ జిల్లా ఉపాధ్యక్షులు మాటూరి బాలేశ్వర్ పాల్గొన్నారు. తమ సమస్యల్ని పరిష్కరించాలని పెన్షనర్లు విజ్ఞప్తి చేయగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.
