శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న మంత్రి…

శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న మంత్రి…

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నా హోబిలంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని గురువారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తల కమిటీ సభ్యులు, ఆలయ అధికారులు, అర్చకులు, ఆలయ మర్యాదలతో, పూర్ణ కుంభంతో, ఆయనకు ఘన స్వాగతం పలికారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆయన
పేరిట ప్రత్యేక పూజలను నిర్వహించారు.

అనంతరం వేద ఆశీర్వాదం, కేశవ్ కు సన్మానించి, సత్కరించారు. తీర్థ ప్రసాదాలను, మంత్రికి ఆలయ ప్రధాన అర్చకులు ద్వారకనాథ్ చార్యులు, మయూరం బాలాజీ చార్యులు అందజేశారు. అనంతరం ఆలయ పరిసరాలను, కోనేరులను, రథాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా దేవాదాయ శాఖ అధికారి గంజి మల్లికార్జున, ఆలయ ధర్మకర్తల మండలి కమిటీ చైర్మన్ రాయంపల్లి రేగాటి నాగరాజు, తహసిల్దార్ భోగన్న గౌడ్, ఎంపీడీవో రవి ప్రసాద్, ఇన్స్పెక్టర్ హోన్నూర్ స్వామి, ఉరవకొండ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయభాస్కర్, కమిటీ సభ్యులు రామకృష్ణ, సుధాకర్, మాజీ సర్పంచులు మోపిడి గోవిందు, ఇంద్రావతి వెంకటేశులు, ఉరవకొండ సింగల్ విండో అధ్యక్షులు ప్యారం కేశవ, పాల గోవిందు, రాంబాబు, టిడిపి నాయకులు బీడీ మారయ్య, కట్టుబడి ఖలందర్, సుదర్శన్, అనిల్, సుంకరత్నమ్మ, చత్రగుడి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply