Peddavangara | వాడవాడలా జోరుగా ప్రచారం
- కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి తోటకూరి శ్రీనివాస్
Peddavangara | పెద్దవంగర, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా అవుతాపురం గ్రామ ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానని కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి తోటకూరి శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు వాడవాడలా తిరుగుతూ ఓటర్లను కలిశారు. ఆప్యాయంగా అందరినీ పలకరిస్తూ మీ అమూల్యమైన ఓటేసి గెలిపించాలని కోరారు. ప్రజా సేవకు జీవితాన్ని అంకితం చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

