• పోలీసుల ఆదేశాలు
  • సీఎం సభ నేపథ్యం
  • భద్రత కల్పించలేదు
  • మళ్లీ చూస్తాం

అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ : తాడిపత్రి విడిచి వెళ్లాలని మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి(Former MLA Peddareddyకి పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 10వ తేదీన అనంతపురంలో సూపర్ సిక్స్, సూపర్ హిట్(Super Six, Super Hit) సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయన భద్రత కోసం పోలీస్ సిబ్బందిని కేటాయించినట్లు పేర్కొన్నారు.

ఆదివారం పెద్దారెడ్డి నివాసానికి వెళ్ళిన పోలీసులు ఆయనతో చర్చించారు. అయితే ఒకరోజు మాత్రమే తనను తాడిపత్రిలో ఉండే విధంగా చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి పర్యటన తర్వాత మళ్లీ తాడిపత్రిలోకి అనుమతి ఇస్తామని పోలీసు(Police) అధికారులు హామీ ఇచ్చారు.

అయితే తనకు రాత మూలకంగా కాగితం ఇవ్వాలని కోరడంతో ఎస్పీ జగదీష్ పేరుతో మెయిల్ పంపించారు. ఆ మేరకు ఆయన తాడిపత్రి వదిలి వెళ్లారు. జేసీ కుటుంబం గడిచిన రెండు రోజుల నుంచి హైదరాబాదు(Hyderabad)లో ఉంటున్నారు. ముఖ్యమంత్రి పర్యటన తర్వాత పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే జేసీ(JC) కుటుంబం అక్కడే ఉండే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో పోలీసులు జేసీ వర్గాన్ని ఏ విధంగా నిలువరిస్తారు అన్నది ఉత్కంఠంగా మారింది. సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశాల మేరకు పోలీసులు కచ్చితంగా పెద్దారెడ్డికి భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. లేకపోతే కోర్టు ధిక్కరణ కిందకు వ్యవహారం వెళుతుంది.

దీనివల్ల పోలీసు అధికారులు ఇబ్బంది ప‌డే అవకాశం లేకపోలేదు. తాడిపత్రిలో సాధారణ పరిస్థితిని తీసుకురావడానికి ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Leave a Reply