వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూస్తా..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : వేసవికాలంలో గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూస్తానని పెద్దపోర్ల సర్పంచ్ బోయిన్ పల్లి కాశమ్మ అన్నారు. శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పెద్దపోర్ల గ్రామపంచాయతీ శివారు గ్రామమైన జీర్ణహళ్లి గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిశీలించారు. జీర్ణహళ్లిలో నీటి ఎద్దడి ఉందని ప్రజలు తెలపడంతో మోటారుకు మరమ్మతు చేయించి నీటి సరఫరా చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాటర్ ట్యాంకు దగ్గర నూతన కుళాయిలకు కనెక్షన్ ఏర్పాటుచేసి నీటి ఎద్దడి తీర్చినట్లు తెలిపారు. గ్రామాల్లో నెలకొన్న మౌలిక వసతుల కల్పనతో పాటు డ్రైనేజీలు సీసీ రోడ్లు ఏర్పాటు చేసి సమస్యల పరిష్కరిస్తూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు పారదర్శకంగా అమలు చేసి గ్రామాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకుడు నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply