Peddapalli | మంచి మనసు..

Peddapalli | మంచి మనసు..

పెద్దపల్లి ఆంధ్రప్రభ – పెద్దపల్లి (Peddapalli) జిల్లా కేంద్రంలోని గణపతి ఆలయ అభివృద్ధికి పది లక్షల రూపాయల విరాళం అందిస్తున్నట్లు సిద్దిపేట సురభి వైద్య కళాశాల చైర్మన్ సురభి హరేందర్ రావు (Surabi harendhra rao) తెలియజేశారు. గురువారం తన జన్మదినం సందర్భంగా ఆది గణపతిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆలయ ఫౌండర్ మెంబర్ వెంకటనారాయణ ఆలయ అభివృద్ధి కోసం ఏదైనా చేయాలని కోరారన్నారు. పది లక్షల రూపాయల విరాళంతో ఆలయ ఆవరణలో అర్చకుడి గది, వాచ్మెన్ క్వార్టర్, యాగశాల చుట్టూ గ్రానైట్ వేయనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విజయేందర్, లక్ష్మీనారాయణతో పాటు పలువురు పాల్గొన్నారు.

Leave a Reply