Peddapalli | సమ్మక్క జాతరకు సకల సౌకర్యాలు..

Peddapalli | సమ్మక్క జాతరకు సకల సౌకర్యాలు..
- గద్దెల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలి..
- భక్తులకు ఇబ్బందులు కలగొద్దు..
- సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలి…
- నిరంతరం అప్రమత్తంగా ఉండాలి..
- రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి
Peddapalli | పెద్దపల్లి జిల్లా ధర్మారం, ఆంధ్రప్రభ : సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పని చేస్తూ.. పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు. ఈ రోజు మంత్రి అడ్లూరి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ధర్మారం మండలంలో పర్యటించి ఎంపిడిఓ కార్యాలయంలో సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్ల పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ… దొంగతుర్తి గ్రామానికి 11 వేల భక్తులు, బోట్ల వనపర్తి గ్రామానికి 9 వేల మంది భక్తులు, నంది మేడారంకు 6 వేల మంది భక్తులు, ధర్మారంకు 5 వేల మంది భక్తులు, కటికనపల్లికు 10 వేల మంది భక్తులు, కొత్తూరుకు 6 వేల మంది భక్తులు, ఎర్ర గుట్టపల్లి కు 8 వేల మంది భక్తులు సమ్మక్క సారలమ్మ జాతర కోసం వస్తారని గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అంచనాలు సిద్ధం చె శామన్నారు. ధర్మారం మండలంలో వివిధ గ్రామాలలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిరిజన సంక్షేమ శాఖ నుంచి 272 కోట్ల రూపాయలు కేటాయించి మేడారంలో శాశ్వత నిర్మాణాలు చేశారని మంత్రి తెలిపారు. మేడారంలో క్యాబినెట్ సమావేశాన్ని కూడా ప్రభుత్వం నిర్వహించిందన్నారు. ధర్మారం మండలంలో సమ్మక్క సారలమ్మ జాతర జరిగే గ్రామాలకు 4 పంచాయతీ కార్యదర్శులను ఇంచార్జిగా నియమించామన్నారు. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 3 వరకు జాతరకు భక్తుల తాకిడి అధికంగా ఉంటుందన్నారు. జాతర సందర్భంగా గ్రామాలలో పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత కల్పించాలని, అక్కడ ఎటువంటి సమస్యలు వచ్చిన వెంటనే సంబంధిత మండల పంచాయతీ అధికారి దృష్టికి తీసుకుని రావాలని మంత్రి తెలిపారు. గ్రామాలలో సమ్మక్క సారలమ్మ జాతర వద్ద గద్దల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎన్డీఎ ఫ్ నుంచి నిధులు మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. జాతర నిర్వహణకు సంబంధించి అవసరమైన విద్యుత్ పోల్స్ ఏర్పాటుకు వెంటనే నిధులు మంజూరు చె యాలని మంత్రి తెలిపారు. 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతరకు మండలం లోని ప్రజలతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని, స్థానిక ప్రజా ప్రతినిధులు, జాతర నిర్వహణ కమిటీలతో సమన్వయం చేసుకుంటూ అధికారులు అవసరం ఏర్పాట్లు చేయాలన్నారు.
