Pedda vangara | సైన్స్ ల్యాబ్ ప్రారంభం..

Pedda vangara | సైన్స్ ల్యాబ్ ప్రారంభం..

Pedda vangara, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో రూ.5 లక్షలతో కోరమాండల్ సహాయ సహకారాలతో వరంగల్ జోనల్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి ద్వారా నిర్మించిన సైన్స్ ప్రయోగశాల, లేడీస్ టాయిలెట్ ను వరంగల్ జోనల్ హెచ్.ఆర్ అమూల్య రెడ్డి, పెద్దవంగర గ్రామ సర్పంచ్ ముద్దసాని పారిజాత కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా అమూల్య రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేందుకు ఈ ప్రయోగశాల ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విద్యార్థులు సైన్స్ పై మక్కువ పెంచుకుని పరిశోధనలు చేయాలని, ప్రయోగాత్మకమైన బోధనల ద్వారా విద్యార్థుల మేధోశక్తి పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ బుధారపు శ్రీనివాస్, ఉప సర్పంచ్ అనపురం వినోద్, మహబూబాబాద్ ఏరియా మేనేజర్ వెంకట్ రావు, ఏరియా మార్కెటింగ్ మేనేజర్ మహేష్, పెద్దవంగర స్టోర్ మేనేజర్ గణేష్, ఫీల్డ్ ఆఫీసర్ డోనాల కర్ణాకర్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply