PEDANA MLA : రైతే రాజు.. అదే సర్యారు లక్ష్యం

PEDANA MLA : రైతే రాజు.. అదే సర్యారు లక్ష్యం
- రైతన్నా నీకోసం ప్రభుత్వం వచ్చింది
- రైతులతో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్
( ఆంధ్రప్రభ, న్యూస్ నెట్ వర్క్ ప్రతినిధి)

పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం ముంజలూరు గ్రామంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతన్నా నీకోసం కార్యక్రమంలో పెడన శాసనసభ్యులు ( Pedana Mla) కాగిత కృష్ణ ప్రసాద్ నేరుగా రైతుల ఇళ్లకు వెళ్లారు. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు వ్యవసాయంలో రాబడికి తీసుకోవాల్సిన చర్యలు రూపొందించి, పంచసూత్రాలను రైతులకు తెలిపారు.
PEDANA MLA
పంటలో దిగుబడి సాధించేలా రైతుకు తోడ్పాటు ఇచ్చేవిధంగా, రైతు వద్దకు నేరుగా వచ్చామన్నారు. , రైతులతో కలిసి గ్రామంలో రైతాంగ సమస్యలపై ముచ్చడించారు. రైతుల సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. రాబడి ధ్యేయంగా.. చేపట్టాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ (Kagitha Krishna Prasad) మాట్లాడుతూ, సాగుకు అవసరమైన నీటి లభ్యత, సాధారణ పంటలు, వాణిజ్య పంటలలో రాబడిని బట్టి దిగుబడి ద్వారా ఆర్థిక బలోపేతానికి రైతుకు అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

వాణిజ్య పంటలలో అంతర పంటలు సాగు చేయడం, సేంద్రీయ ఎరువుల ద్వారా భూమిలో పోషక విలువలు పెంచుతూ, దిగుబడి పెరిగేలా, సాంకేతికంగా డ్రోన్స్ (Drones) వినియోగం ద్వారా ఖర్చు తగ్గించుకోవడం ద్వారా , రైతును రాజుగా చూడాలనే ప్రయత్నంలో రైతులకు ఇంటికి వెళ్ళి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారులను, సిబ్బందిని రైతుకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
