స్వయంగా ఎమ్మెల్యే పించన్ అందజేత
( ఆంధ్రప్రభ, బంటుమిల్లి )
పెడన నియోజకవర్గం, బంటుమిల్లి మండలం, ముంజులూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారులకు పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ సోమవారం ఉదయం పింఛన్ డబ్బులు అందజేశారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లిన ఎమ్మెల్యే… పింఛన్ నగదును స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాటామంతీ పంచుకున్నారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెన్షన్ లబ్ధిదారులకు ఒకటో తేదీన నగదు అందిస్తున్నాం కేవలం అనర్హుల తొలగింపు ప్రక్రియ మాత్రమే నిర్వహిస్తున్నామని, అసత్యాలు నమ్మవద్దని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ అన్నారు
ముంజులూరు హర్షం
గత ప్రభుత్వంలో మంజులూరులో తాగునీటి సమస్యను పట్టించుకోకపోవడంతో మంచి నీటి చెరువులో నీటిని వాడుకోవడానికి కూడా పనికిరాకుండా పోయాయి. కూటమి ప్రభుత్వం రాగానే పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ చొరవతో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి సహకారంతో మైక్రో వాటర్ ఫిల్టర్ సదుపాయం లభించిందని, పరిశుభ్రమైన తాగునీరు తమకు లభించిందని ముంజులూరు గ్రామ ప్రజలు హర్షం వ్యక్త పరిచారు. బంటుమిల్లి మండల టీడీపీ నాయకులు కూనపురెడ్డి వీరబాబు, బంటుమిల్లి డీసీ చైర్మన్ బొర్రా కాశీ పాల్గొన్నారు..