నిన్న అరటి.. నేడు శెనగ సెగ!

- అప్పుల ఊబిలో శెనగ రైతులు
- మార్కెట్లో పడిపోతున్న ధరలు
- మద్దతు ధరలకు కొనే వారు కరువు
- కోల్డ్ స్టోరేజీల్లో మగ్గిపోతున్న నిల్వలు
- ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలపై ఆశలు
- కౌలు రైతులకు కోలుకోలేని దెబ్బ
- గిడ్డంగి అద్దె చెల్లించలేక పాట్లు
అమరావతి, ఆంధ్రప్రభ: శెనగ రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. మద్దతు ధరలకు కొనేందుకు మార్కెట్ మొఖం చాటేయటంతో దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. రాయల సీమలోని కర్నూలు, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో శెనగ సాగు విస్తీర్ణం అధికంగా ఉంది.
ప్రకాశం జిల్లాలోనే 50 వేల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో రైతులు శెనగ సాగు చేశారు. డిమాండ్ అధికంగా ఉన్న జేజీ – 11, నంద్యాల గ్రామ్ – 119 రకం శెనగలను రైతులు అధికంగా పండిస్తున్నా ధరలు మాత్రం దోబూచులాడుతున్నాయి. గత ఏడాది సెప్టెంబర్-అక్టోబరులో ఏపీలో అత్యధికంగా పండించే జేజీ-11 రకం శెనగల క్వింటా ధర రూ 9 వేలు పలికింది.
ఆ తరువాత వెంటనే భారీ స్థాయిలో ధరలు తగ్గిపోయాయి. గతంలో క్వింటా రూ 10 వేలకు పైగా కాబూలీ (తె) రకం శెనగలకు మార్కెట్లో డిమాండ్ బాగా తగ్గింది. వ్యాపారులు కొను గోలుకు కూడా ముందుకు రావటం లేదని రైతులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం శెనగలకు ప్రకటించిన క్వింటాకు రూ 5650 మద్దతు ధర కూడా రావటం లేదు.
దీంతో రైతులకు ఏపీ సీడ్స్ సబ్సిడీ ధరలకు రైతులకు పంపిణీ చేసే శెనగ విత్తనాల ధర కూడా తమ పంటకు మార్కెట్లో రావటం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. గతేడాది ధరలు పడిపోవటంతో పండించిన పంటను రైతు లు అమ్ముకోకుండా కోల్డ్ స్టోరేజీలకు తరలించారు.
70 లక్షల క్వింటా ళ్లకు పైగా పంట శీతల గిడ్డంగుల్లో ఉంది. క్వింటాకు వెయ్యి చొప్పున గిడ్డంగుల అద్దె చెల్లించలేక, మార్కెట్లో గిట్టు-బాటు- కాని ధరలకు అమ్ముకోలేక రైతులు అవస్థలు ఎదుర్కొంటు-న్నారు. లాభాలు దేవు డెరుగు..కనీసం నష్టాలు లేకుండా బయటపడాలంటే క్వింటాకు రూ. 7వేల మద్దతు ధరను ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
విదేశాల నుంచి భారీగా దిగుమతులు…
శెనగల దిగుమతులపై గతం లో ఉన్న సుంకాలను కేంద్ర ప్రభు త్వం భారీగా తగ్గించింది. ఈ ఏడాది 31 వరక ఎర్ర శెనగలపై దిగుమతి సుంకాన్ని పూర్తిగా రద్దు చేయటంతో టాంజానియా, కెనడా, ఆస్ట్రేల్రియా, సూడాన్, శ్రీలంకల లక్షలాది టన్నుల శెన గలు దిగుమతి అయ్యాయి.
గత ఏడాది సరిగ్గా రబీ పంట చేతికం దిన సమయంలో దిగుమతి సుంకాన్ని రద్దు చేయటంతో ధరలు క్రమేపీ పడిపోయాయి. విదేశాల నుంచి దిగుమతి అయిన శెనగల నిల్వలు ఇప్పటికీ ఓడరేవుల్లో ఉన్నాయి..ట్రేడర్లు ఇది దేశీయ శెనగ మార్కెట్ ఫై తీవ్రమైన ప్రభావం చూపించిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో శెనగలపై 30 శాతం దిగుమతి సుంకాన్ని విధించటం ద్వారా స్థానిక పంటకు మార్కెట్ అవకాశాలు కల్పించాలని రైతులు కోరుతున్నారు. ఒక వైపు ఎగుమతులు తగ్గుముఖం పట్టటం, మరో వైపు స్థానిక మార్కె ట్లలో ధరలు పతనం అవుతుండ టంతో కోల్డ్ స్టోరేజీల్లో నిల్వలు పేరుకుపోతున్నాయి.
కర్నూలు మార్కెట్లో మంగళవారం శెనగల క్వింటా సగటు ధర రూ.4529 ఉండగా, నంద్యాల మార్కెల్లో ధర కాస్త ఎక్కువగా ఉంది. ధరలు దిగజారిపోయి కోల్డ్ స్టోరేజీల్లో నిల్వలు పేరుకుపోయిన దశలో శెనగలకు మద్దతు ధరను క్వింటాకు రూ.7 వేలుగా ప్రకటించటమే కాకుండా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
కౌలు రైతులకు భారీ నష్టం..
మెట్ట ప్రాంతాల్లో పత్తి, పొగాకు పంటలకు ప్రత్యామ్నా యంగా ప్రభుత్వ ప్రోత్సాహంతో ప్రారంభమైన శెనగల సాగుతో తొలినాళ్లలో రైతులు భారీ లాభాలు ఆర్జించారు. ఆ తరువాత క్రమేపీ సాగు విస్తీర్ణం పెరిగింది. భూములను కౌలుకు తీసుకుని సాగు చేయటం అధికమైంది. ఎకరాకు సగటున రూ 20 వేలు చెల్లించి శెనగలు సాగు చేసిన రైతులు గడిచిన మూడేళ్ళుగా తీవ్రమైన నష్టాలు ఎదుర్కొంటున్నారు.
గత ఏడాది రబీలో పండించిన పంటలో అధిక భాగం కోల్డ్ స్టోరేజీలో మగ్గుతుంది. సొంత భూముల్లో శెనగలు పండిం చిన రైతులే నష్టాలు ఎదుర్కొంటుండగా కౌలు రైతులయితే నిండా మునిగే పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో దేశీయ, ఎగుమతి మార్కెట్, డిమాండ్, సప్లయ్‌లపై మార్కెట్ ఇంటెలిజెన్సీ మరింతగా అధ్యయనం చేసి రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
