Peace Talks – ఉక్రెయిన్ యుద్ధం – అమెరికా, రష్యా విదేశాంగ మంత్రుల మధ్య చర్చలు ప్రారంభం
రియాద్ – ఉక్రెయిన్ యుద్ధ అంశంపై అమెరికా, రష్యా అధికారులు సౌదీ అరేబియాలో సమావేశమయ్యారు. మంగళవారం రియాద్ లో జరిగిన సమావేశంలో రష్యా తరఫున విదేశాంగ మంత్రి సెర్గీ లావ్ రోవ్, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విదేశాంగ విధాన సలహాదారు యూరి ఉషాకోవ్ పాల్గొన్నారు.
అమెరికా తరఫున విదేశాంగ మంత్రి మార్కో రూబియో, జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్ట్జ్, డొనాల్డ్ ట్రంప్ పశ్చిమాసియా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్ కాఫ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఉక్రెయిన్ ను ఆహ్వానించకపోవడం గమనార్హం.