కాలుష్యం కారక పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలి

కాలుష్యం కారక పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలి

  • పీసీబీ రాష్ట్ర అధికారులకు బాధితుల వినతి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ లోని పోచంపల్లి మండలం అంతమ్మ గూడెం గ్రామ పరిసరాలలో ఉన్న కాలుష్య కారక పరిశ్రమలలో పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించి కాలుష్యానికి పాల్పడుతున్న పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధ్యత రైతులు పిసిబి రాష్ట్ర ఉన్నత అధికారులకు వినతి పత్రాలను అందజేశారు.

అనుమతిలేని రా మెటీరియల్స్ వాడుతూ అనుమతి లేని ఉత్పత్తిలు తయారు చేస్తున్న విషయం సీపీసీబీ అధికారులు గుర్తించినప్పటికీ అటువంటి చర్యలు తీసుకోవడం లేదని, టీజీపీసీబీ పంపించిన రాష్ట్రస్థాయి అధికారులు పరిశ్రమ వారికి ముందస్తు సమాచారం అందజేయడమే కాకుండా, పరిశ్రమ లోపల ఉన్న ప్రొడక్షన్ బ్లాక్, వేర్ హౌస్, హాజర్డస్ వ్యర్థాల నిలువ, సంభందించిన అన్ని ప్రదేశాలను పూర్తిస్థాయిలో తనిఖీలు చేయడం లేదన్నారు.

తనిఖీకి వచ్చిన అధికారులు పరిశ్రమలో ఉండాల్సిన వెహికల్ మూమెంట్ రిజిస్టర్, ఇన్ వర్డ్, అవుట్ వార్డ్ రిజిస్టర్, ప్రొడక్షన్ బ్యాచ్ షీట్స్ మొదలైనవి ఏవి తనిఖీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. పరిశ్రమలోపట వాయు కాలుష్యాన్ని నివారించుటకు వినియోగించే స్క్రబ్బర్లు ఏవి పనిచేయడం లేదు. ఈ స్క్రబ్బర్లకు సంబంధించిన ఆన్లైన్ పీహెచ్ మీటర్లు కాలుష్య నియంత్రణ మండల కార్యాలయానికి అనుసంధానం చేయడం లేదు.

అంతమ్మగూడెం గ్రామం వైపు పరిశ్రమల నుంచి వాసన వస్తున్నదని అధికారులు గుర్తించినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదు. పరిశ్రమల లోపల ఉన్న వివోసీ మీటర్లు టాంపరింగ్ చేయబడి పనిచేయడం లేదు. ప్రస్తుతం ఉన్న మెంబర్ సెక్రటరీ పరిశ్రమలు చేయు కాలుష్యానికి పూర్తిగా సహకారం అందిస్తున్నారు. పరిశ్రమల యాజమాన్యాలు రసాయన వ్యర్ధాలు బయట వదిలి వేసినట్లు కిందిస్తాయి సిబ్బంది నివేదికలు ఇచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.

పరిశ్రమలపై కాలుష్యం ఫిర్యాదుల తర్వాత రాష్ట్ర కార్యాలయంలో జరిగే టాస్క్ ఫోర్స్ సమావేశం గురించి కనీసం ఫిర్యాదుదారులకు సమాచారం కూడా అందించకుండా, ఏకపక్షంగా వ్యవహరిస్తూ, పరిశ్రమలకు వ్యతిరేకంగా ఉన్న నివేదికలను దాచిపెట్టి, పరిశ్రమలపై చర్యలు తీసుకోవడం లేదని, సంబంధిత ఉన్నత అధికారులు పరిశ్రమలలో పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించి కాలుష్యకారక పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని అవసరమైతే ఇక్కడ నుంచి పరిశ్రమలు తరలించాలని కాలుష్యం బాధితులు కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో బాధితులు వస్పరి ప్రభ, రావుల ధనలక్ష్మి, అమృత, గుమ్మి దామోదర్ రెడ్డి, రావుల రాంరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వస్పరి శ్రీశైలం తదితరులు ఉన్నారు.

Leave a Reply