హోం గ్రౌండ్ లో నేడు చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో.. పంజాబ్ కింగ్స్ జట్టు భారీ స్కోర్ నమోదు చేసింది. టాస్ గెలచిన తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. చెలరేగి ఆడింది. ప్రియాంష్ ఆర్య, శశాంక్ సింగ్ మెరుపులు మెరిపించారు. దాంతో పంజాబ్ 6 వికెట్ల నష్టానికి 219 సాధించింది.
పంజాబ్ ప్లేయర్లలో కేవలం ముగ్గురు ప్లేయర్లు మాత్రమే రెండంకెల స్కోర్ నమోదు చేశారు. కీలక బ్యాటర్లు విఫలమైనా.. క్రీజులో పాతుకుపోయిన ప్రియాంష్ ఆర్య… (42 బంతుల్లో 103) శతక్కొట్టాడు. ప్రియాన్ష్ ఆర్య రాజేసిన అగ్నికి శశాంక్ సింగ్ ఆజ్యం పోశాడు. శశాంక్ సింగ్ ( 36 బంతుల్లో 52 నాటౌట్) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఇక మార్కో జాన్సన్ (19 బంతుల్లో 34) దంచికొట్టాడు. వీరు మినహా మరే ప్లేయర్ డబుల్ డిజిట్ స్కోర్ సాధించలేదు.
సీఎస్‌కే బౌలర్లలో ఖలీల్ అహ్మద్, అశ్విన్ రెండేసి వికెట్లు తీయగా.. ముకేష్ చౌదరి, నూర్ అహ్మద్ ఒక్కో వికెట్ పడగొట్టారు. దీంతో 220 పరుగుల భారీ టార్గెట్ తో చెన్నై జట్టు ఛేజింగ్‌కు దిగనుంది.