Pawankalyan | త్వరగా కోలుకోవాలి..

Pawankalyan | త్వరగా కోలుకోవాలి..
Pawankalyan | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ సమయంలో చరణ్‌కు స్వల్ప గాయమైనట్లు సమాచారం. షూటింగ్ జరుగుతున్న సమయంలో కంటి సమీపంలో చిన్నపాటి గాయం తగిలిందని తెలిసింది.
అయితే ఈ గాయం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సాధారణ గాయమేనని చిత్ర యూనిట్ తెలిపింది. డాక్టర్ల సూచన మేరకు చరణ్ రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నారని సమాచారం. విశ్రాంతి అనంతరం ఆయన మళ్లీ షూటింగ్‌లో పాల్గొననున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో కొనసాగుతోంది. అయితే ఈ క్రమంలో రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
