Thanjavur | కుమారస్వామిని దర్శించుకున్న‌ పవన్ కళ్యాణ్

కుంభ‌కోణం ఆల‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్స్వామిమలై క్షేత్రంలో పూజ‌లు
కుమారుడు అకీరానందన్ తో కలిసి శ్రీ స్వామినాథ స్వామి దర్శనం
కొన‌సాగుతున్న‌ షష్ట షణ్ముఖ క్షేత్ర యాత్ర

కుంభ‌కోణం, త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌భః ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యాత్మిక పర్యటన కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన తమిళనాడు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా గురువారం ఉద‌యం షష్ట షణ్ముఖ క్షేత్రాల్లో ఐదవ క్షేత్రం స్వామిమలై ఆల‌యాన్నితన కుమారుడు అకీరా నందన్‌‌తో సంద‌ర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఆలయ అర్చకులు కన్నన్ గురుకల్.. సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు.. పంచ హారతులిచ్చారు.. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ధ్వజస్థంభానికి మొక్కారు పవన్ కల్యాణ్. కంద షష్టి కవచ పారాయణంలో పాల్గొన్నారు..

స్వామినాథ స్వామి దర్శనానంతరం ఆలయంలో వెలసిన ఆదిదంపతులు సుందరేశ్వరన్ స్వామి, మీనాక్షి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కి డిప్యూటీ కమిషనర్ ఉమా దేవి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆయ‌న‌తో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ ఆనంద్ సాయి ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నారు..

Leave a Reply