Pathikonda | రగిలిన కక్షలు.. పగిలిన తలలు..

Pathikonda | రగిలిన కక్షలు.. పగిలిన తలలు..
Pathikonda, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రభ : చిత్తూరు (Chittoor) జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం (Gangavaram) మండలం పత్తికొండ గ్రామానికి చెందిన వసీం కుటుంబీకులు మీడియాతో మాట్లాడుతూ.. బాలసుబ్రమణ్యం అనే వ్యక్తి శనివారం రాత్రి అకారణంగా మమ్మల్ని దూషిస్తూ రాళ్లతో దాడి చేశాడు. దీంతో మా ఇంట్లో ఆడవారికి మాకు తలలు పగిలి తీవ్రంగా గాయాలయ్యాయి. అర్ధరాత్రి పోలీసులకు సమాచారం అందించామని తెలియచేశారు.
ఈ విషయం తెలుసుకున్న బాలసుబ్రమణ్యం రిటర్న్ గా మా పైనే పోలీసులకు (police) కంప్లైంట్ చేసి ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. గతంలో కూడా ఇదే విధంగా ప్రవర్తించాడు. వైసీపీ (YCP) ప్రభుత్వం ఉన్నప్పుడు కేసులు పెట్టినా మందలించి వదిలేశారు. అతని వలన మా కుటుంబానికి ప్రాణహాని ఉంది. దయవుంచి తమకు న్యాయం చేయాల్సిందిగా వేడుకున్నారు. కాగా ఘటన రాజకీయ కోణంలో జరిగిందా..? లేదా పాత కక్షల నేపథ్యంలో జరిగిందా..? అనేది పూర్తి వివరాలు పోలీసులు తెలయచేయాల్సివుంది.
