హైదరాబాద్, ఆంధ్రప్రభ : పాస్ పోర్టు జారీ చేయడంలో దేశంలోనే హైదరాబాద్(Hyderabad) ఐదవ స్థానంలో ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) అన్నారు. ఈ రోజు ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్(MGBS Metro Station) లో పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ రోజు నుంచి
ఎంజీబీవీ(MGBV) మెట్రో స్టేషన్‌లోనూ, రాయదుర్గం(Raidurg) పాత ముంబయి రోడ్డులోనూ రెండు పాస్‌పోర్టు(Passport) కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ రోజు నుంచి ఈ రెండు సేవా కేంద్రాల నుంచి పాస్‌పోర్టు సేవలు పొంద వచ్చు. అమీర్ పేట్(Amir Pate) ఆదిత్య ట్రేడ్ సెంటర్ లోని సేవలు అందించిన పాస్ పోర్టు కేంద్రం ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ వద్దకు తరలించారు. అలాగే టోలీ చౌకీ షేక్ పేట్ నాలా ఆనంద్ సిలికాన్ చిప్ వద్ద ఉన్న పాస్ పోర్టు సేవా కేంద్రాన్ని రాయదుర్గం ప్రాంతంలోని పాత ముంబయి రోడ్డు సిరి బిల్డింగ్ లోకి మార్చారు. ఈ రోజు నుంచి కొత్త ప్రదేశాల్లో ప్రజలకు సేవలు అందించనున్నాయి.
ఎంజీబీఎస్ పాస్ పోర్టు సేవా కేంద్రం ప్రారంభోత్సవంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(MP Asaduddin), రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్(Anil Kumar Yadav), ఎమ్మెల్సీ మిర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫండి, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, పాస్ పోర్ట్స్ జాయింట్ సెక్రటరీ కే.జే శ్రీనివాసులు, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన(Dasari Harichandana) తదితరులు పాల్గొన్నారు.

