Passengers | క్రేన్ రైలుపై పడి… 22 మంది మృతి

Passengers | క్రేన్ రైలుపై పడి… 22 మంది మృతి
Passengers | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : క్రేన్ రైలుపై జారిపడి 22మంది మృతిచెందిన విషాద ఘటన థాయ్‌లాండ్‌లో చోటుచేసుకుంది. నిర్మాణ పనులు జరుగుతుండగా రైలుపై (Train) ఓ క్రేన్ జారిపడడంతో రైలు పట్టాలు తప్పడంతో పాటలు మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో సుమారు 22 మంది మృతిచెందినట్లు స్థానిక మీడియా వర్గాలు పేర్కొన్నాయి. పదుల సంఖ్యలో గాయపడ్డారు. బ్యాంకాక్‌కు 230 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో రైలులో 150 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది.
