పటాన్ చెరు జూన్ 30 ఆంధ్ర ప్రభ : పటాన్ చెరు (మం)పాశమైలారం పారిశ్రామిక వాడలోని సీగాచి కెమికల్స్ ( Sigachi Camical) పరిశ్రమలో భారీ పేలుడు (explodes) సంభవించింది. నేటి ఉదయం కార్మికులు పనిచేస్తుండగా ఒక్కసారిగా రియాక్టర్ ( Reactor) పేలింది. దీంతో పరిశ్రమలో భారీగా ఎగిసిపడ్డాయి. మంటల్లో పలువురు కార్మికులు చిక్కుకున్నారు. తాజా సమాచారం ప్రకారం 20 మందికి పైగా కార్మికులు గాయపడ్డారు .
సమాచారం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి రెండు ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటలు ఆర్పుతున్నాయి. గాయపడిన వారిని అంబులెన్సులలో చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది,











