యాదాద్రి, ఆంధ్రప్రభ : భువనగిరి (Bhuvanagiri) లోని మాంటిస్సోరీ ప్రైవేటు పాఠశాల ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఈ రోజు ధర్నా నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం అధిక ఫీజులు వసూళ్లు చేస్తుందని ఆరోపించారు. అనాజీపురం (Anajipuram) గ్రామ విద్యార్థులకు పాఠశాలకు రావడానికి సంబంధించిన స్కూల్ బస్ (School bus) ని నిలిపివేసి బడి పిల్లను మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. యజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరారు.

Leave a Reply