Parakala | మోటార్ స్వాధీనం..

Parakala | మోటార్ స్వాధీనం..

  • అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన గృహవాసులు

Parakala | పరకాల, ఆంధ్రప్రభ : మిషన్ భగీరథ మంచినీటి నల్లాకు అక్రమంగా బిగించిన మోటార్ ను మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రభ వెబ్, దినపత్రికలో ప్రచురితమైన కథనానికి పరకాల మున్సిపల్ కమిషనర్ సోమిడి అంజయ్య స్పందించి అక్రమంగా మిషన్ భగీరథ నల్లాకు బిగించిన మోటార్ ను స్వాధీనం చేసుకోవాలని మున్సిపల్ సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

దీంతో మున్సిపల్ సిబ్బంది భూపాలపల్లి రోడ్డు పద్మశాలి వీధిలోని వినాయక వైన్స్ బిల్లింగ్ కు మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ కు అక్రమంగా అదనపు నీటి కోసం మోటార్ బిగించిన మోటర్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ గృహవాసులు పరకాల మున్సిపల్ కమిషనర్ కు, అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply