Parakala | పల్లెల్లో విద్యుత్ ప్రజాబాట

Parakala | పల్లెల్లో విద్యుత్ ప్రజాబాట
- సమస్యల సత్వర పరిష్కారానికి
- పరకాల ఎన్పీడీసీఎల్ ఏఈ రాజు
Parakala | పరకాల, ఆంధ్రప్రభ : విద్యుత్ సమస్యలపై సత్వర పరిష్కారానికి విద్యుత్ పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని పరకాల ఎన్పీడీసీఎల్ ఏఈ డి రాజు అన్నారు. ఇవాళ పరకాల మండలంలోని వెల్లంపల్లి గ్రామంలో విద్యుత్ ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. వెల్లంపల్లి గ్రామ సర్పంచ్ మచ్చ మహేందర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించగా విద్యుత్ సమస్యల సత్వర పరిష్కారానికి విద్యుత్ పల్లెబాట నిర్వహించడం జరుగుతుందన్నారు.
గృహవాసులు, రైతులు, ఇతర వినియోగదారులు విద్యుత్ సమస్యలు ఏమున్నా పరిష్కారానికి పల్లెబాట నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏఈ రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ సిబ్బంది, గ్రామ రైతులు, ప్రజలు పాల్గొన్నారు.
