Parakala | ఓటర్లకు రుణం తీర్చుకుంటా..

Parakala | ఓటర్లకు రుణం తీర్చుకుంటా..

15వ వార్డు బిజెపి కౌన్సిలర్ కుక్కల విజయ్ కుమార్
వార్డులోని ఓటర్లను కలుస్తూ కృతజ్ఞతలు

Parakala | పరకాల, ఆంధ్రప్రభ : పురపాలక సంఘం 15వ వార్డు ఓటర్లు తమ అమూల్యమైన ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో కౌన్సిలర్ గా గెలిపించిన 15 వ వార్డు ఓటర్ల రుణం బిజెపి అభ్యర్థి కుక్కల విజయ్ కుమార్ తీర్చుకుంటా అని అన్నారు. 15 వ వార్డులో ఇంటింటికి వెళుతూ ఓటర్లను కలుస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వార్డులోని ప్రజల ఆశీర్వాదం తమ పై ఉండటం వల్ల గెలుపొందడం జరిగిందని ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.15వ వార్డు ఓటర్లకు అందుబాటులో ఉంటూ, వార్డులోని సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. 15వ వార్డులోని ఓటర్లు సమస్యలు ఏవి ఉన్నప్పటికీ తమని కలిసి వివరిస్తే ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని కౌన్సిలర్ కుక్కల విజయ్ కుమార్ తెలిపారు.

Leave a Reply