Parakala | అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా..

Parakala | అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా..

  • బీఆర్ఎస్ 7వ వార్డు అభ్యర్థి దుంపేటి నాగరాజు

Parakala | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పురపాలక సంఘం ఏడవ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి దుంపేటి నాగరాజు విస్తృత ప్రచారం నిర్వహించారు. అవకాశం ఇవ్వండి ఏడవ వార్డును అభివృద్ధి చేసి చూపిస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు. ఈ రోజు ఏడోబార్డు బిఆర్ఎస్ అభ్యర్థి దుంపేటి నాగరాజు ఆధ్వర్యంలో పట్టణంలోని వెల్లంపల్లి రోడ్డు ప్రాంతంలో, పద్మశాలి భవనం వీధిలో విస్తృత ప్రచారం నిర్వహించారు. పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆశీస్సులతో ఏడవ వార్డులోని ప్రజా సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తానని అన్నారు. అభ్యర్థి నాగరాజు వెంట నల్లెల్ల లింగమూర్తి, గునిగంటి రవి, ఉడుత సుమన్, అడప గణేష్, కనుకుంట్ల సురేష్, రాజు, శివ తదితరులు ఉన్నారు.

Leave a Reply